నార్త్ అమెరికాలో ‘ఓజీ’ రికార్డు కలెక్షన్స్ !

నార్త్ అమెరికాలో ‘ఓజీ’ రికార్డు కలెక్షన్స్ !
X
వారాంతంలోనే ఆ మార్కును దాటి ఉంటే అది ఒక పెద్ద ఘనతగా నిలిచేది.. కానీ శనివారం మరియు ఆదివారం రోజుల్లో కలెక్షన్లు తగ్గడంతో 5 మిలియన్ డాలర్స్ కు దగ్గరగా మాత్రమే వెళ్ళగలిగింది.

పవన్ కళ్యాణ్ నటించిన గ్యాంగ్‌స్టర్ డ్రామా చిత్రం "ఓజీ" ఉత్తర అమెరికాలో తొలి వారాంతంలో 4 మిలియన్ల డాలర్స్ కు పైగా వసూలు చేసి ఆయన కెరీర్‌లో కొత్త రికార్డు సృష్టించింది. అయితే.. ఇది 5 మిలియన్ల డాలర్స్ మైలురాయిని తృటిలో మిస్సయింది. వారాంతంలోనే ఆ మార్కును దాటి ఉంటే అది ఒక పెద్ద ఘనతగా నిలిచేది.. కానీ శనివారం మరియు ఆదివారం రోజుల్లో కలెక్షన్లు తగ్గడంతో 5 మిలియన్ డాలర్స్ కు దగ్గరగా మాత్రమే వెళ్ళగలిగింది.

"ఓజీ" మొదటి రోజు ఏకంగా 3.67 మిలియన్ డాలర్స్ వసూలు చేసింది. ఆ తర్వాత రెండో రోజు, మూడో రోజుల్లో చెరో అర మిలియన్ డాలర్లకు అటూ ఇటూగా వసూలు చేసింది. కానీ శని, ఆదివారాల్లో చెప్పుకోదగ్గ వృద్ధి లేకపోవడంతో.. ఈ చిత్రం 5 మిలియన్ డాలర్స్ మార్కును దాటలేకపోయింది.

ఒక్క ఆదివారం నాడే "ఓజీ" 200K డాలర్స్ కంటే ఎక్కువ వసూలు చేసి, మొత్తం వసూళ్లను సుమారు 4.93 మిలియన్ డాలర్స్ కు చేర్చింది. అయినా.. ఇది విదేశాల్లో అత్యంత పెద్ద తెలుగు హిట్ చిత్రాలలో ఒకటిగా, ఉత్తర అమెరికాలో పవన్ కళ్యాణ్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.

ఇటీవల కాలంలో విడుదలైన ప్రధాన తెలుగు చిత్రాలలో.. తొలి వారాంతంలోనే లాభాల జోన్లోకి అడుగుపెట్టిన మొదటి చిత్రం కూడా "ఓజీ" కావడం విశేషం. పవన్ కళ్యాణ్ చివరి చిత్రాలైన "బ్రో", "హరిహర వీరమల్లు" పూర్తిగా నిరాశ పరిచినప్పటికీ.. "ఓజీ" మాత్రం అద్భుతమైన లాభాలను ఆర్జించడమే కాకుండా... ఉత్తర అమెరికాలో అత్యధిక వసూళ్లు సాధించిన ఆల్‌టైమ్ తెలుగు చిత్రాల జాబితాలోకి చేరింది.

సుజీత్ దర్శకత్వంలో.. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ కథానాయికగా నటించింది. ఈ చిత్రానికి, తనకి లభించిన ఆదరణకు ఆమె ఇటీవల ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ చిత్రం తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 154 కోట్లకు పైగా వసూలు చేసింది.

Tags

Next Story