నార్త్ అమెరికాలో అదరగొడుతున్న ‘ఓజీ’

నార్త్ అమెరికాలో అదరగొడుతున్న ‘ఓజీ’
X
బుధవారం ప్రీమియర్ షోల నుంచే, ఈ చిత్రం 3 మిలియన్ల డాలర్స్ కంటే ఎక్కువ వసూలు చేసింది. తద్వారా పవర్ స్టార్‌కి సరికొత్త బెంచ్‌మార్క్‌ను నెలకొల్పింది.

పవన్ కల్యాణ్‌ "ఓజీ" సినిమా నార్త్ అమెరికన్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. బుధవారం ప్రీమియర్ షోల నుంచే, ఈ చిత్రం 3 మిలియన్ల డాలర్స్ కంటే ఎక్కువ వసూలు చేసింది. తద్వారా పవర్ స్టార్‌కి సరికొత్త బెంచ్‌మార్క్‌ను నెలకొల్పింది.

ఇది పవన్ కల్యాణ్ కెరీర్‌లోనే ఈ ప్రాంతంలో అతిపెద్ద ఓపెనింగే కాదు, అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం కూడా. ఇంతకుముందు ఆయన బెస్ట్ మూవీ కలెక్షన్స్ 2 మిలియన్ డాలర్స్. అయితే " ఓజీ" కేవలం ప్రీమియర్ షోల తోనే ఆ మార్కును దాటేసింది.

‘ఓజీ’ సినిమాకి అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన వస్తుండటంతో.. ఫస్ట్ వీక్ స్ట్రాంగ్ వసూళ్లు నమోదవుతాయని అంచనా వేస్తున్నారు. పవన్ కల్యాణ్ గత కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించినంతగా ఆడకపోయినా.. దర్శకుడు సుజిత్ రూపొందించిన ఆకట్టుకునే ట్రైలర్‌లు, అగ్రెసివ్ ప్రమోషన్లు భారీ హైప్‌ను సృష్టించాయి. ఇది ప్రేక్షకులను రికార్డు స్థాయిలో థియేటర్లకు రప్పించింది.

Tags

Next Story