ఓవర్సీస్ ప్రీసేల్స్ లో ‘ఓజీ’ అరుదైన ఘనత

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటింగ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఓజీ’. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా విడుదలకు ముందే కొత్త రికార్డులు సృష్టిస్తోంది. సెప్టెంబర్ 25 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రం.. ఉత్తర అమెరికాలో ఇప్పటికే 1 మిలియన్ డాలర్స్ కు పైగా ప్రీ-సేల్స్‌తో సత్తా చాటింది. తెలుగు సినిమాల్లో ఇది చాలా అరుదైన ఘనత. విశేషమేమిటంటే, విడుదలకు 21 రోజుల ముందే ఈ మైలురాయిని చేరుకుంది.
‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఇంత వేగంగా ఈ రికార్డు సాధించిన రెండో తెలుగు సినిమాగా ‘ఓజీ’ నిలిచింది. ఉత్తర అమెరికాలో సెప్టెంబర్ 24న ఈ చిత్రం ప్రీమియర్ కానుంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ విషయాన్ని ఒక కొత్త పోస్టర్‌తో ప్రకటిస్తూ.. “ఆయన పేరుతో రికార్డులు జన్మిస్తాయి” అని ప్రత్యేకంగా మెన్షన్ చేసింది.
ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఓజస్ గంభీరగా కనిపిస్తుండగా, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ఓమి పాత్రలో నటిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా వీరి పాత్రలను పరిచయం చేస్తూ ఒక స్పెషల్ వీడియో గ్లింప్స్ విడుదలైంది, ఇది హైప్‌ను మరింత పెంచింది.
ఇదే ఊపుతో.. వచ్చే వారంలో ‘ఓజీ’ సులభంగా 2 మిలియన్ డాలర్స్ మార్కును దాటవచ్చని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. అమెరికాతో పాటు గ్లోబల్ మార్కెట్లలోనూ ఈ సినిమా హవా జోరుగా ఉంది. డీవీవీ దానయ్య నిర్మాణంలో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై తెరకెక్కిన ‘ఓజీ’.. ఈ ఏడాది అతిపెద్ద బ్లాక్‌బస్టర్లలో ఒకటిగా నిలవనుందని అంచనా వేస్తున్నారు.
Records are born in his name 💥💥💥#OG #TheyCallHimOG pic.twitter.com/rZ7bIxTJFv
— DVV Entertainment (@DVVMovies) September 3, 2025
-
Home
-
Menu