‘ఓదెల 2’ రిలీజ్ డేట్ ఫిక్స్!

‘ఓదెల 2’ రిలీజ్ డేట్ ఫిక్స్!
X

మిల్కీ బ్యూటీ తమన్నా కాస్త గ్యాప్ తర్వాత తెలుగు ప్రేక్షకుల్ని పలకరించబోతున్న చిత్రం ‘ఓదెల 2‘. ఇప్పటికే హిట్టైన ‘ఓదెల రైల్వే స్టేషన్‘కి కొనసాగింపుగా ఈ చిత్రం రూపొందుతుంది. డివోషనల్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో రాబోతున్న ఈ మూవీ కథ, కథనాల పరంగా ఓ కొత్త తరహా అనుభూతిని అందిస్తుందని ఇప్పటికే టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.





లేటెస్ట్ గా ‘ఓదెల 2‘ రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చింది. ఏప్రిల్ 17న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో తమన్నా పవర్ ఫుల్ లుక్ లో ఆకట్టుకుంటుంది.

మధు క్రియేషన్స్, సంపత్ నంది టీం వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి సంపత్ నంది కథ అందిస్తుండగా.. అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్నారు. ‘కాంతార, విరూపాక్ష’ వంటి మ్యూజికల్ హిట్స్ అందించిన అజనీష్ లోకనాథ్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.

Tags

Next Story