పాకిస్థాన్ ప్లేయర్‌కు ఎన్టీఆర్ ముఖం? ఫ్యాన్స్ ఫైర్!

పాకిస్థాన్ ప్లేయర్‌కు ఎన్టీఆర్ ముఖం? ఫ్యాన్స్ ఫైర్!
X

క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ తన తాజా యూట్యూబ్ వీడియో ద్వారా 'ఆర్ఆర్ఆర్' సినిమా గురించి మరోసారి చర్చకు తెరతీశాడు. ఇండియా - పాకిస్థాన్ మధ్య ఛాంపియన్ ట్రోఫీ లీగ్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించిన సందర్భంగా, అశ్విన్ చేసిన ఓ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.




అశ్విన్ తన వీడియో థంబ్ లైన్ లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ వెనుక రామ్ చరణ్ పిక్‌కి తన ముఖాన్ని మార్ఫ్ చేయగా, పాకిస్థాన్ ప్లేయర్ వెనుక ఎన్టీఆర్ ముఖాన్ని పెట్టి రిలీజ్ చేశాడు. ఇది రామ్ చరణ్, ఎన్టీఆర్ అభిమానుల మధ్య వాదనలకు దారి తీసింది. చెర్రీ అభిమానులు ఈ ఎడిట్ 'ఆర్ఆర్ఆర్'లో రామ్ చరణ్ ప్రధాన పాత్రధారిగా ఉన్న విషయాన్ని మరోసారి రుజువు చేస్తుందని చెబుతుంటే, ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఈ మార్ఫింగ్ దారుణమని మండిపడుతున్నారు.

అశ్విన్ చర్య ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను తీవ్ర అసంతృప్తికి గురి చేయడంతో, సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. పాకిస్థాన్ ప్లేయర్‌కి ఎన్టీఆర్ ముఖాన్ని మార్ఫ్ చేయడం తారక్ అభిమానులకు ఆగ్రహం తెప్పించగా, మరోవైపు రామ్ చరణ్ అభిమానులు అశ్విన్ ఎడిట్‌కు మద్దతు పలుకుతున్నారు. ఈ వివాదం ఎంతవరకు వెళ్లబోతుందో, దీనిపై అశ్విన్ ఎలా స్పందిస్తాడో వేచిచూడాలి.

Tags

Next Story