తారక్ హ్యూమన్ మెషీన్ లా ఉంటాడా?

తారక్ హ్యూమన్ మెషీన్ లా ఉంటాడా?
X
. ‘‘ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్‌లో ఒక రా, అన్‌ఫిల్టర్డ్ ఎనర్జీ ఉంటుంది. అది చూస్తే, ఒక హ్యూమన్ మెషిన్ స్పష్టమైన ఉద్దేశంతో ఫుల్ ఫోర్స్‌లో ఆపరేట్ అవుతున్నట్టు అనిపిస్తుంది,” అని అనైతా వివరించారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఇప్పటివరకూ తన సినిమాల్లో చూపించిన పాత్రలకు పూర్తిగా భిన్నమైన ఒక కొత్త అవతారంలో ‘వార్ 2’లో కనిపించబోతున్నాడు. ఈ స్పై థ్రిల్లర్‌లో ఆయన పాత్రకు స్టైల్ క్రియేట్ చేసిన స్టైలిస్ట్ అనైతా ష్రాఫ్ అడజానియా మాట్లాడుతూ.. సినిమా జానర్‌కు పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యేలా, రియలిస్టిక్‌గా, గ్రౌండెడ్‌గా ఎన్టీఆర్ లుక్‌ను డిజైన్ చేయడమే తన టార్గెట్ అని చెప్పారు. “ఈ పాత్రలో ఎన్టీఆర్‌ను చూస్తే, ఆడియన్స్‌కు ఒక డీప్, లేయర్డ్ క్యారెక్టర్ ఫీల్ వస్తుంది..” అని ఆమె జోడించారు.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతగానో ఆరాధించే ఆయన సిగ్నేచర్ మాచో స్టైల్, అవుట్-అండ్ అవుట్ స్వాగ్‌ను ఇంటాక్ట్‌గా ఉంచడం అనైతా ముందున్న అతిపెద్ద చాలెంజ్. ‘‘ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్‌లో ఒక రా, అన్‌ఫిల్టర్డ్ ఎనర్జీ ఉంటుంది. అది చూస్తే, ఒక హ్యూమన్ మెషిన్ స్పష్టమైన ఉద్దేశంతో ఫుల్ ఫోర్స్‌లో ఆపరేట్ అవుతున్నట్టు అనిపిస్తుంది,” అని అనైతా వివరించారు. ఈ సినిమాలో ఆయన లుక్‌ను డిజైన్ చేస్తున్నప్పుడు, ఫ్యాన్స్ ఎక్స్‌పెక్ట్ చేసే ఆ ఇంటెన్స్ వైబ్‌ను కంటిన్యూ చేయడంతో పాటు, కథకు సూట్ అయ్యే కొత్త డైమెన్షన్ యాడ్ చేయడంపై ఆమె ఫోకస్ పెట్టారు.

ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఒక పవర్‌ఫుల్ విలన్ పాత్రలో కనిపిస్తున్నారు. హృతిక్ రోషన్ ఒక రా ఏజెంట్‌గా నటిస్తున్నారు. ఈ రెండు క్యారెక్టర్స్ మధ్య క్లాష్ హై-ఆక్టేన్ డ్రామాకు గ్యారెంటీ అని టీజర్ చూస్తేనే అర్థమవుతుంది. ఎన్టీఆర్ లుక్‌ను క్రియేట్ చేస్తున్నప్పుడు, హృతిక్ పాత్రకు టోటల్ కాంట్రాస్ట్‌గా ఉండాలని అనైతా జాగ్రత్త తీసుకున్నారు. “ఎన్టీఆర్ పాత్ర ఒక సీరియస్, బిజినెస్-డ్రివెన్ మైండ్‌సెట్ ఉన్న వ్యక్తిగా ఉంటుంది. అందుకే ఆయన లుక్‌ను బ్లాక్, బ్రౌన్ షేడ్స్‌లో, ఎలాంటి ఎక్సెస్ లేకుండా, స్ట్రెయిట్-ఫార్వర్డ్‌గా, ఇంపాక్ట్‌ఫుల్‌గా డిజైన్ చేశాము. ఇది నో-నాన్సెన్స్, క్లీన్, డైరెక్ట్ వైబ్ ఇస్తుంది,” అని ఆమె చెప్పారు. ఈ మినిమలిస్టిక్ అప్రోచ్, ఎన్టీఆర్ పాత్రకు ఒకక డెప్త్, సీరియస్ టోన్ ఇస్తూ.. అదే సమయంలో ఆయన ఐకానిక్ చారిష్మాను హైలైట్ చేస్తుంది.

Tags

Next Story