‘గాడ్ ఆఫ్ వార్’ స్టార్ట్ అయ్యేది అప్పటి నుంచే !

‘గాడ్ ఆఫ్ వార్’ స్టార్ట్ అయ్యేది అప్పటి నుంచే !
X
ఎన్.టి.ఆర్ 'డ్రాగన్' కంప్లీట్ అవ్వగానే మధ్యలో ఏ గ్యాప్ తీసుకోకుండా డైరెక్ట్‌గా 'గాడ్ ఆఫ్ వార్' సెట్స్‌లోకి వెళ్తారు.

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, క్రియేటివ్ జీనియస్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో మరో బిగ్గెస్ట్ మైథలాజికల్ డ్రామా రాబోతుంది. అదే 'గాడ్ ఆఫ్ వార్'. తమిళనాడులో ఎక్కువగా పూజలందుకునే.. యుద్ధ దేవుడు అని పిలిచే మురుగన్ లెజెండ్ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. కార్తికేయ స్వామికి అంతటి ప్రాధాన్యత ఉన్నప్పటికీ, ఆయన కథను ఇప్పటివరకు మెయిన్‌స్ట్రీమ్ సినిమాలు పెద్దగా టచ్ చేయలేదు. ఈ అన్‌టచ్డ్ పాయింట్‌తోనే త్రివిక్రమ్ పక్కాగా సినిమా తీయడానికి ప్లాన్ చేస్తున్నారట.

ప్రస్తుతం త్రివిక్రమ్ వెంకటేశ్‌తో సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండటం, అలాగే ఎన్.టి.ఆర్ - ప్రశాంత్ నీల్ సినిమా 'డ్రాగన్' కూడా 2026 చివర్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉండటంతో.. ఈ 'గాడ్ ఆఫ్ వార్' ప్రాజెక్ట్ లేట్ అవుతుందేమోనని కొద్ది రోజులుగా రూమర్స్ వినిపించాయి. అయితే, ఆ రూమర్స్‌లో నిజం లేదని, ఈ సినిమా షెడ్యూల్ ప్రకారంనే జరుగుతుందని నమ్మదగిన వర్గాలు క్లారిటీ ఇచ్చాయి.

ఎన్.టి.ఆర్ 'డ్రాగన్' కంప్లీట్ అవ్వగానే మధ్యలో ఏ గ్యాప్ తీసుకోకుండా డైరెక్ట్‌గా 'గాడ్ ఆఫ్ వార్' సెట్స్‌లోకి వెళ్తారు. త్రివిక్రమ్ కూడా వెంకటేష్ సినిమాని 2026 సమ్మర్ కల్లా ఫినిష్ చేసి, వెంటనే ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తారట. 2027 స్టార్టింగ్ నుంచే ఈ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని సమాచారం.

Tags

Next Story