రీస్టార్ట్ కాబోతున్న యన్టీఆర్ - నీల్ మూవీ షూటింగ్

యంగ్ టైగర్ యన్టీఆర్, పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ భారీ యాక్షన్ డ్రామా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ఇంకా అఫీషియల్ టైటిల్ ఖరారు కాలేదు, కానీ “డ్రాగన్” అనే పేరు బాగా ప్రచారంలో ఉంది. ఈ సినిమా షూటింగ్ ఆగస్టు మొదటి వారంలో ఆగిపోయింది. సెప్టెంబర్‌లో తిరిగి స్టార్ట్ కానుందని సమాచారం.
ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ “వార్ 2” ఫెయిల్ అయిన తర్వాత.. ఫ్యాన్స్ “డ్రాగన్” టీమ్ నుంచి ఏదో ఒక ఎక్సైటింగ్ అప్డేట్ లేదా ప్రమోషనల్ మెటీరియల్ రిలీజ్ అవుతుందని ఆశించారు. “వార్ 2” నిరాశను మరచిపోయి కొంత ఉత్సాహం పొందాలని వారి ఆలోచన. వినాయక చవితి సందర్భంగా ఏదైనా గ్లింప్స్ రిలీజ్ అవుతుందని కూడా ఫ్యాన్స్ మధ్య బజ్ నడిచింది, కానీ అలాంటిదేమీ జరగలేదు.
ఇండస్ట్రీ టాక్ ప్రకారం.. ప్రశాంత్ నీల్ ఇలాంటి డిమాండ్స్‌కి లొంగడు. అతని స్టైల్ ఎప్పుడూ సినిమాను ముందు పూర్తి చేసి.. రిలీజ్‌కి నాలుగైదు నెలల ముందు నుంచి ప్రమోషన్స్ స్టార్ట్ చేయడమే.“డ్రాగన్” లో ఎన్టీఆర్ ఒక పవర్‌ఫుల్ యాక్షన్ రోల్‌లో కనిపించనున్నాడు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. 2026 జూన్‌లో గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.
-
Home
-
Menu