కొత్త రిలీజ్ డేట్ వచ్చింది !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న యాక్షన్ స్పెక్టకిల్‌పై టాలీవుడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ చిత్రం యన్టీఆర్- నీల్ అనే వర్కింగ్ టైటిల్‌తో కర్ణాటకలో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సినిమాను ముందుగా 2026 జనవరి 9న సినిమాను విడుదల చేయాలని భావించిన చిత్రబృందం.. షూటింగ్ ఆలస్యం కావడంతో తాజా షెడ్యూల్ ప్రకారం 2026 జూన్ 25న విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని నేడు అధికారికంగా ప్రకటించారు.
ఈ చిత్రానికి "డ్రాగన్" అనే టైటిల్‌ను పరిశీలనలో ఉంచారు. అయితే టైటిల్‌పై తుది నిర్ణయం తీసుకోలేదు. నిర్మాత రవి శంకర్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, “ఈ సినిమా యాక్షన్ సినిమాల పరంగా కొత్త బెంచ్‌మార్క్‌లను సృష్టించబోతోంది” అని చెప్పారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. 'కేజీఎఫ్' సినిమాలకు సంగీతాన్ని అందించిన రవి బస్రూర్ ఈ చిత్రానికి కూడా సంగీతం అందిస్తున్నారు.
హీరోయిన్‌గా ఎవరు నటించబోతున్నారన్న విషయాన్ని చిత్రబృందం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే.. ఇటీవల చర్చల్లో ఉన్న సమాచారం ప్రకారం రుక్మిణివసంత ఈ సినిమాలో కథానాయికగా ఎంపికయ్యే అవకాశాలున్నాయి. అన్ని విభాగాల్లో అత్యున్నత ప్రమాణాలతో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌పై అభిమానులు, ఇండస్ట్రీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 2026లో ఇది తెలుగు సినీ పరిశ్రమలోని అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాల్లో ఒకటిగా నిలవబోతోంది.
-
Home
-
Menu