ఎన్టీఆర్ ‘డ్రాగన్’.. ఇంటర్నేషనల్ లెవెల్ మూవీ!

స్ట్రెయిట్ మూవీస్ తోనే కాదు.. అనువాద చిత్రాలతోనూ అదిరిపోయే హిట్స్ అందుకుంటుంది మైత్రీ మూవీ మేకర్స్. లేటెస్ట్ గా మైత్రీకి 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్'తో పెద్ద హిట్ ఇచ్చింది. ఈ సినిమా మౌత్ టాక్‌తోనే సూపర్ హిట్ కావడం, విడుదలకు ముందు పెద్దగా ప్రచారం చేయనప్పటికీ మంచి వసూళ్లు సాధించడం గమనార్హం. ఈ విజయాన్ని మరింతగా వినియోగించుకోవాలని మైత్రీ మూవీస్ భావిస్తోంది. ‘డ్రాగన్’ రన్‌ను కొనసాగించేందుకు మైత్రీ మరింత ప్రచారాన్ని పెంచుతోంది.
ఇదే సమయంలో మైత్రీ మూవీస్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ సినిమాను నిర్మిస్తోంది. ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ విజయంతో ఉత్సాహంగా ఉన్న మైత్రీ, ఎన్టీఆర్ మూవీపై హైప్ క్రియేట్ చేయడానికి సిద్ధమవుతోంది. నిర్మాత రవి మాట్లాడుతూ, 'ఎన్టీఆర్ ‘డ్రాగన్’ మామూలు సినిమా కాదు. ఇది ఇంటర్నేషనల్ లెవెల్ మూవీ. పెద్ద ‘డ్రాగన్’ వచ్చి ప్రపంచాన్ని కప్పేస్తుంది’’ అంటూ అభిమానుల్లో ఉత్సాహం నింపారు.
-
Home
-
Menu