మాసివ్ ఈవెనింగ్ విత్ ‘మ్యాన్ ఆఫ్ మాసెస్’

మాసివ్ ఈవెనింగ్  విత్ ‘మ్యాన్  ఆఫ్ మాసెస్’
X
ఏప్రిల్ 12 శనివారం, అంటే ఈ రోజు సాయంత్రం సినిమా ప్రీ-రిలోజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరగనుంది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హాజరుకానున్నారని, చిత్రం నిర్మాణ సంస్థలు అశోక క్రియేషన్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ అధికారికంగా ప్రకటించాయి.

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా, ప్రతాప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కిన "అర్జున్ సన్నాఫ్ వైజయంతి" సినిమా ఏప్రిల్ 18న థియేటర్లలో విడుదల కానుంది. విడుదలకు మరో వారం మాత్రమే మిగిలి ఉండటంతో, చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో, ఏప్రిల్ 12 శనివారం, అంటే ఈ రోజు సాయంత్రం సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ శిల్పకళా వేదికలో గ్రాండ్‌గా జరగనుంది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హాజరుకానున్నారని, చిత్రం నిర్మాణ సంస్థలు అశోక క్రియేషన్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ అధికారికంగా ప్రకటించాయి.

సోషల్ మీడియా ద్వారా విడుదల చేసిన పోస్టర్‌లో “మ్యాన్ ఆఫ్ మాసెస్ తో ఒక మాసివ్ ఈవెనింగ్‌ను సెలబ్రేట్ చేద్దాం. ఏప్రిల్ 12న అర్జున్ సన్నాఫ్ వైజయంతి ప్రీ-రిలోజ్ ఈవెంట్‌లో కలుద్దాం” అంటూ పేర్కొన్నారు. ఇక మరొక ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే ఈ చిత్ర ట్రైలర్‌ను ఏప్రిల్ 13 సాయంత్రం 7:59 గంటలకు విడుదల చేయనున్నట్లు ఇప్పటికే చిత్రబృందం ప్రకటించింది. ఈ మాస్ యాక్షన్ డ్రామాలో నందమూరి కళ్యాణ్ రామ్‌కు జోడిగా సాయామి ఖేర్ నటిస్తున్నారు. విశిష్టమైన పాత్రలో, శక్తిమంతమైన పోలీస్ ఆఫీసర్‌గా విజయశాంతి నటిస్తున్నారు.

ఇప్పటివరకు విడుదలైన టైటిల్ పోస్టర్, టీజర్, ప్రమోషనల్ మెటీరియల్స్ అన్నీ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొల్పాయి. అందుకే, "అర్జున్ సన్నాఫ్ వైజయంతి" సినిమాపై అభిమానుల్లో భారీగా ఆసక్తి నెలకొనింది. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఈవెంట్‌కు హాజరుకానుండటంతో ఈ సినిమా మరింత హైప్‌ను సంపాదించుకుంటోంది.

Tags

Next Story