ఈ బర్త్ డే కు ఎలాంటి స్పెషల్ లేదు !

ఈ  బర్త్ డే కు ఎలాంటి స్పెషల్ లేదు !
X
అల్లు అర్జున్-అట్లీ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రానికి సమంతను ఒక ప్రధాన పాత్రకు ఎంపిక చేయబోతున్నారని ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. అంతేకాక, ఆమె వ్యక్తిగత జీవితం గురించి కూడా ఏదైనా కీలక ప్రకటన చేస్తారని కథనాలు వచ్చాయి. కానీ.. వీటిలో ఏదీ జరగలేదు.

టాలెంట్‌కు, అందానికి మారుపేరైన సమంత రుత్ ప్రభు తాజాగా తన 38వ పుట్టినరోజు జరుపుకుంది. అయితే ఈసారి ఆమె పుట్టినరోజు నాడు ఎంతో నిశ్శబ్దంగా, వ్యక్తిగతంగా గడిపింది. సోషల్ మీడియా ద్వారా తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సినీ ప్రముఖులకు సమంత ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా ధన్యవాదాలు తెలిపింది.

ఈ సందర్భంగా సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేసింది. “ఏప్రిల్ ఫీల్స్” అనే శీర్షికతో, ఆరోగ్య పరిరక్షణ, ఇతర బ్రాండ్‌లతో తన అనుబంధాన్ని తెలిపే 19 అంశాలను షేర్ చేసింది. ఇంకా, సమంత ప్రస్తుతం తన తొలి నిర్మాణ చిత్రం "శుభం" ను ప్రమోట్ చేస్తోంది. హారర్-కామెడీ జానర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆమె చిన్న క్యామియో పాత్రలో కనిపించనుంది.

ఒకవైపు ఇవి జరుగుతుండగా.. మరేదైనా ప్రత్యేక ప్రకటనలుంటాయా అనే ఆసక్తి అభిమానుల్లో, మీడియాలో కనిపించింది. సమంత పుట్టినరోజుకు ముందు కొన్ని సోషల్ మీడియా పేజీలు, మీడియాలో.. అల్లు అర్జున్-అట్లీ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రానికి సమంతను ఒక ప్రధాన పాత్రకు ఎంపిక చేయబోతున్నారని ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. అంతేకాక, ఆమె వ్యక్తిగత జీవితం గురించి కూడా ఏదైనా కీలక ప్రకటన చేస్తారని కథనాలు వచ్చాయి. కానీ.. వీటిలో ఏదీ జరగలేదు.

సమంత మాత్రం తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పింది: “38, స్ట్రాంగిష్, హాటిష్” అని పేర్కొంటూ తన ధైర్యం, ఆకర్షణ ఇంకా పెరిగినట్టు చాటి చెప్పింది. ప్రస్తుతం "శుభం" తో పాటు మరో సినిమా కూడా సమంత చేతిలో ఉంది. త్వరలో దీనిపై మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

Tags

Next Story