ఈ సమ్మర్ కి కూడా నిరాశ తప్పదు !

టాలీవుడ్‌లో మరోసారి వేసవి సీజన్ నిరాశపరుస్తోంది. గతేడాది లాగే ఈసారి కూడా ఏప్రిల్ నాటికి పెద్ద సినిమాల్లేని పరిస్థితి కొనసాగుతోంది. మార్చ్ నెలలో ఇప్పటివరకు బిగ్ రిలీజ్ లేదు. మిగిలిన రెండు వారాల్లో కూడా ‘పెళ్లికాని ప్రసాద్’, ‘రాబిన్ హుడ్’, ‘మ్యాడ్ స్క్వేర్’ లాంటి మీడియం రేంజ్ సినిమాలే థియేటర్లలో సందడి చేయనున్నాయి.
ఏప్రిల్‌లో ‘జాక్’, ‘కన్నప్ప’, ‘సారంగపాణి జాతకం’ వంటి సినిమాలే విడుదలకు సిద్ధమవుతున్నాయి. అసలు, ‘హరిహర వీరమల్లు’ మార్చి నుంచి, ‘రాజాసాబ్’ ఏప్రిల్ నుంచి వాయిదా పడటంతో.. ఈ వేసవి బాక్సాఫీస్ మరింత స్తబ్దుగా మారింది.
మే నెలలో ‘హిట్-3’, ‘హరిహర వీరమల్లు’, ‘కింగ్ డమ్’ సినిమాలు ఉన్నాయి. అయితే పవన్ కళ్యాణ్ సినిమా మరోసారి వాయిదా పడకుండా ఉంటే.. ఈ వేసవికి ఓ మెరుగైన హిట్ లభించే అవకాశం ఉంటుంది. గతేడాది ‘కల్కి’ వాయిదా పడటంతో వేసవి సీజన్ బాక్సాఫీస్ దారుణంగా సాగింది. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులే కొనసాగుతుండటంతో ఈ ఏడాది వేసవి కూడా పెద్ద సినిమాల్లేక బాక్సాఫీస్ చప్పగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.
-
Home
-
Menu