ఇద్దరి వివాహం అప్పుడేనట !

ఇద్దరి వివాహం అప్పుడేనట !
X
వారి పెళ్లి సన్నాహాలు ఇప్పటికే మొదలైనట్లు సమాచారం. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ జంట జనవరిలో పెళ్లి చేసుకోనున్నారని, ఇరు కుటుంబాలు ఏర్పాట్లు చేస్తున్నాయని తెలుస్తోంది.

కొద్ది రోజుల క్రితం.. టాలీవుడ్ హీరోయిన్ నివేదా పేతురాజ్ అందరినీ ఆశ్చర్యపరిచింది. తన బాయ్‌ఫ్రెండ్‌ని ప్రపంచానికి పరిచయం చేస్తూ. ఒక ఫోటో షేర్ చేస్తూ, ఆమె దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్త రాజ్‌హిత్ ఇబ్రాన్‌తో రిలేషన్‌ షిప్‌లో ఉన్నట్లు వెల్లడించింది. అప్పటి నుంచి దాదాపు వారం గడిచినా, ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఎలాంటి కొత్త అప్‌డేట్స్ లేదా పోస్టులు చేయలేదు.

ఇదిలా ఉంటే.. వారి పెళ్లి సన్నాహాలు ఇప్పటికే మొదలైనట్లు సమాచారం. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ జంట జనవరిలో పెళ్లి చేసుకోనున్నారని, ఇరు కుటుంబాలు ఏర్పాట్లు చేస్తున్నాయని తెలుస్తోంది. నివేదా పెళ్లి తర్వాత దుబాయ్‌లో స్థిరపడే అవకాశం ఉందని కూడా ఊహాగానాలు సాగుతున్నాయి.

రాజ్‌హిత్ ఇబ్రాన్ దుబాయ్‌లో నివసిస్తున్నారు. అలాగే నివేదా తల్లిదండ్రులు, సోదరులు కూడా అదే నగరంలో ఉన్నారు. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో, నివేదా తన ప్రాధాన్యత శాంతియుత జీవనం అని స్పష్టం చేసింది. ఆమె తన నటనా కెరీర్‌ను కొనసాగించకపోవచ్చని సూచించింది. ప్రస్తుతం తన వద్ద ఎలాంటి తెలుగు సినిమాలు లేవని తెలిపింది.

Tags

Next Story