నితిన్ ‘ఎల్లమ్మ’ కు అదే సమస్య

ఒక్కప్పుడు యూత్‌ఫుల్ లుక్‌తో హిట్ల పరంపర సాధించిన యంగ్ హీరో నితిన్ ఇప్పుడు తన కెరీర్‌లో అత్యంత క్లిష్టమైన దశను ఎదుర్కొంటున్నాడు. వరుసగా వచ్చిన ఫెయిల్యూర్స్ కు తోడు.. తాజాగా శ్రీలీలతో కలిసి నటించిన ‘రాబిన్ హుడ్’ కు కూడా నిరాశాజనక స్పందన రావడంతో నితిన్‌పై సందేహాలు మళ్లీ మొదలయ్యాయి. ఇప్పుడు ఆయన తదుపరి చిత్రం ‘ఎల్లమ్మ’ పై మంచి బజ్ ఉన్నప్పటికీ, కథలో కొత్త దనం ఉన్నప్పటికీ.. కథానాయిక ఎంపిక మాత్రం సమస్యగా మారింది.
జాతీయ అవార్డు విజేత బలగం వేణు దర్శకత్వంలో.. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు బ్యానర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రారంభంలో మంచి ఆసక్తిని రేకెత్తించింది. ‘బలగం’ విజయంతో దర్శకుడిపై నమ్మకం పెరిగింది. నితిన్‌తో ఆయన కలయిక కొత్త జోష్ తెచ్చింది. కానీ చిత్రీకరణ ప్రారంభానికి దగ్గరగా వచ్చేసిన ఈ సమయంలో .. కథానాయిక ఖరారు కాకపోవడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది.
మొదట సాయి పల్లవిని సంప్రదించినట్టు వార్తలు వచ్చాయి, అయితే డేట్ క్లాష్ కారణంగా ఆమె ఈ ప్రాజెక్ట్‌కు నో చెప్పింది. ఆ తర్వాత కీర్తి సురేష్ ఎంపికయ్యారన్న వార్తలతో అభిమానులు ఊపిరి పీల్చారు. కానీ తాజా సమాచారం ప్రకారం కీర్తి కూడా డేట్స్ సమస్యలని చెబుతూ బయటకు వచ్చినట్టు తెలిసింది. అయితే ప్రత్యేకంగా.. నితిన్ వరుస ఫెయిల్యూర్స్ ఆమె నిర్ణయంపై ప్రభావం చూపిందని అంటున్నారు.
నితిన్-శ్రీలీల జోడీగా వచ్చిన రెండు సినిమాలు ఫ్లాపవ్వడంతో, ప్రముఖ కథానాయికలు “ఫ్లాప్ జోడీ” ట్యాగ్ తమ మీద పడుతుందనే ఆందోళనతో వెనక్కి తగ్గుతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. టాలీవుడ్‌లో విజయం అతి కీలకం. ఒక సినిమా ఫ్లాప్ అయితే.. మరో అవకాశానికి తావే ఉండదు. అందుకే కథానాయికలు తమ సేఫ్టీ చూసుకుంటున్నారని అంటున్నారు. మరి ఎల్లమ్మ లో నితిన్ కు ఎవరు జోడీగా సెట్ అవుతారో చూడాలి.
-
Home
-
Menu