ఆ టైటిల్ పైనే ఆసక్తి చూపుతున్న నితిన్

ఆ టైటిల్ పైనే ఆసక్తి చూపుతున్న నితిన్
X
దీనికి “స్వారి” అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని.. ఇదివరకే వార్తలొచ్చాయి. అయితే ఈ టైటిల్ పైనే నితిన్ ఎక్కువగా ఆసక్తి చూపుతున్నాడని తెలుస్తోంది.

యంగ్ హీరో నితిన్, వరుసగా బాక్సాఫీస్ ఫెయిల్యూర్స్ తో కఠిన దశను ఎదుర్కొంటున్నాడు. తాజాగా విడుదలైన “తమ్ముడు” కూడా ఫ్లాప్ కావడంతో.. తన కెరీర్‌ను రీసెట్ చేసే ప్రయత్నంలో ఉన్నాడు. ఇప్పటివరకు కమిట్ అయిన ప్రాజెక్ట్‌లను పక్కనపెట్టినట్లు తెలుస్తోంది.

ఇప్పుడు నితిన్.. దర్శకుడు విక్రమ్ కుమార్‌తో మరోసారి చేతులు కలుపుతున్నాడు. ఈ కొత్త ప్రాజెక్ట్ ఒక స్పోర్ట్స్ డ్రామాగా రూపొందనుందని సమాచారం. దీనికి “స్వారి” అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని.. ఇదివరకే వార్తలొచ్చాయి. అయితే ఈ టైటిల్ పైనే నితిన్ ఎక్కువగా ఆసక్తి చూపుతున్నాడని తెలుస్తోంది. బహుశా ఈ టైటిలే ఖాయం కావచ్చని సమాచారం.

నితిన్, విక్రమ్ కుమార్ కాంబో గతంలో “ఇష్క్” సినిమాతో హిట్ అందుకున్నారు. ఇప్పుడు ఈ సినిమాతో నితిన్‌కు ఫ్రెష్ మేకోవర్ ఇవ్వాలని విక్రమ్ కుమార్ భావిస్తున్నాడు. ప్రీ-ప్రొడక్షన్ పనులు ఇప్పటికే స్టార్ట్ అయ్యాయి, కాస్టింగ్ కూడా జరుగుతోంది. ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు నితిన్ వేరే ప్రాజెక్ట్‌లను చేపట్టడం లేదు.

Tags

Next Story