హిట్ కోసం ‘స్వారీ’ చేయబోతున్న నితిన్ !

యంగ్ హీరో నితిన్ కొన్ని సంవత్సరాలుగా వరుస ఫ్లాప్‌లతో సతమత మవుతున్నాడు. 'భీష్మ' తర్వాత అతడు ఒక్క హిట్ కూడా ఇవ్వలేకపోయాడు. 'రాబిన్‌హుడ్', 'తమ్ముడు' సినిమాలపై భారీ ఆశలు పెట్టుకున్నాడు. కానీ రెండూ ఘోరంగా విఫలమయ్యాయి. ఇప్పుడు అతడి ముందు వేణు ఎల్దండి దర్శకత్వంలో 'ఎల్లమ్మ'.. సినిమా ఉంది. దాంతో పాటు నితిన్ మరో సినిమాను లైన్ లో పెట్టుకున్నాడని సమాచారం.
తనకు ‘ఇష్క్ ’ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది. నిజానికి విక్రమ్ కె. కుమార్ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కే స్పోర్ట్స్ డ్రామా అని ముందుగా వార్తలు వచ్చాయి. తాజా మీడియా నివేదికల ప్రకారం, నితిన్ ఈ చిత్రంలో గుర్రపు స్వారీ వీరుడిగా కనిపించనున్నాడు. 'స్వారీ' అనే టైటిల్‌ను నిర్మాతలు పరిశీలిస్తున్నారని, కానీ ఇంకా ఏదీ ఖరారు కాలేదని సమాచారం.
నితిన్ 'ఎల్లమ్మ', విక్రమ్ సినిమాలను ఒకేసారి చేస్తాడా లేక ఒక్కొక్కటిగా దృష్టి పెడతాడా అనేది చూడాలి. గతంలో నితిన్ కష్టాల్లో ఉన్నప్పుడు, విక్రమ్ కె. కుమార్ 'ఇష్క్' సినిమాతో ఆయనకు కొత్త ఊపిరి పోశాడు. అందుకే ఈ కాంబో సినీ ప్రియుల్లో మంచి బజ్ క్రియేట్ చేస్తోంది.
-
Home
-
Menu