అదిరిపోయే నైట్ యాక్షన్ సీక్వెన్స్!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న “పెద్ది” సినిమా షూటింగ్ ఫుల్ జోష్‌తో, స్పీడ్‌గా సాగుతోంది. ఇప్పుడు టీమ్ ఒక మాసివ్ నైట్ యాక్షన్ సీక్వెన్స్‌ని షూట్ చేస్తోంది. ఇది సినిమాకే కీలక హైలైట్ అవుతుందని టాక్. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఆర్. రత్నవేలు సెట్స్ నుంచి ఒక స్టన్నింగ్ మూమెంట్‌ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఇంటెన్స్ నైట్ సీక్వెన్స్‌లో రామ్ చరణ్ టోటల్ బీస్ట్ మోడ్‌లో కనిపిస్తున్నాడు. రత్నవేలు పోస్ట్ చేసిన ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారి, ఫ్యాన్స్‌ని ఖుషీ చేస్తోంది. ఈ సీక్వెన్స్ సినిమాకి మేజర్ టర్నింగ్ పాయింట్ అవుతుందని, థియేటర్స్‌లో గూస్‌బంప్స్ మూమెంట్ క్రియేట్ చేస్తుందని అందరూ ఫీలవుతున్నారు.
తొలి చిత్రం “ఉప్పెన”తో బ్లాక్‌బస్టర్ కొట్టిన డైరెక్టర్ బుచ్చిబాబు సానా... “పెద్ది” ని కూడా అదే రేంజ్‌లో సక్సెస్ ఫుల్ గా తెరకెక్కిస్తాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శివ రాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ వంటి టాలెంటెడ్ యాక్టర్స్ కీలక రోల్స్‌లో కనిపించనున్నారు. ఈ స్టార్-స్టడెడ్ కాస్ట్ సినిమాపై అంచనాలను మరింత పెంచేస్తోంది.
“పెద్ది” సినిమా టెక్నికల్ టీమ్ కూడా టాప్-నాచ్. సినిమాటోగ్రఫీ బాధ్యతలు ఆర్. రత్నవేలు చూస్తుండగా, మ్యూజిక్ డైరెక్టర్‌గా ఆస్కార్ విన్నర్ ఏ.ఆర్. రెహమాన్ ఉన్నారు, ఇది సినిమాకి ఒక ఎపిక్ వైబ్ తీసుకొస్తుందని వేరే చెప్పాలా? సినిమా రిలీజ్ డేట్ కూడా లాక్ అయింది. “పెద్ది” 2026 మార్చి 27న థియేటర్స్‌లో సందడి చేయనుంది. ఈ మాసివ్ ప్రాజెక్ట్‌పై అంచనాలు ఆల్రెడీ స్కై-హైలో ఉన్నాయి. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.
Filmed a terrific night action sequence with gritty visuals @AlwaysRamCharan bro breathes fire 🔥🔥#peddi @arrahman @BuchiBabuSana @RathnaveluDop #Janhvi Kapoor @vriddhicinemas
— Rathnavelu ISC (@RathnaveluDop) June 21, 2025
# Nabhakanth pic.twitter.com/wtQl6pLZzP
-
Home
-
Menu