ఆశలన్నీ ‘ది రాజా సాబ్’ పైనే !

ఆశలన్నీ ‘ది రాజా సాబ్’ పైనే !
X
ప్రభాస్‌ సరసన హీరోయిన్ గా ‘ది రాజా సాబ్’.. కూడా ఆలస్యం అవుతూ వస్తోంది. దాని రిలీజ్ ఇప్పుడు 2026 సంక్రాంతికి వాయిదా పడింది.

అందాల హీరోయిన్ నిధి అగర్వాల్ గత నాలుగు సంవత్సరాల్లో రెండు పెద్ద తెలుగు సినిమాలపై ఆశలు పెట్టుకుంది. అవి తనను టాప్ లీగ్‌లోకి తీసుకెళ్తాయని ఆశించింది. ఈ రెండూ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌లు. తెలుగు సినిమా ఇండస్ట్రీలోని ఇద్దరు పెద్ద స్టార్లతో రూపొందాయి. ఒక సినిమా కోసం ఆమె ఎక్స్‌క్లూజివ్ కాంట్రాక్ట్ కూడా సైన్ చేసింది.

కానీ.. ఆమె మొదటి ప్రాజెక్ట్ పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించిన ‘హరిహర వీరమల్లు’ పార్ట్ 1.. బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. దానికి తోడు, ఆమె నటన ఎటువంటి ప్రశంసలు అందుకోలేదు. ఆమె ప్రయత్నాలు వృథా అయ్యాయి. ఆమె రెండవ ప్రాజెక్ట్.. ప్రభాస్‌ సరసన హీరోయిన్ గా ‘ది రాజా సాబ్’.. కూడా ఆలస్యం అవుతూ వస్తోంది. దాని రిలీజ్ ఇప్పుడు 2026 సంక్రాంతికి వాయిదా పడింది.

ఆమె ఆ మూవీలో తన పాత్రను పూర్తి చేసినప్పటికీ.. సినిమా ఫలితం కోసం ఇంకా ఎదురుచూపులో ఉంది. ‘ది రాజా సాబ్’ పై తన ఆశలన్నీ పెట్టుకుంది. ఇలా.. ఒక సినిమా ఫ్లాప్ అయిన తర్వాత.. మరొకటి ఇంకా విడుదల కాని పరిస్థితిలో.. నిధికి ప్రస్తుతం కొత్త ఆఫర్లు లేవు. టాప్ లీగ్‌లోకి ఎదగాలనే ఆమె ప్రణాళిక ఫలించలేదు. ఇప్పుడు ఆమె దృష్టి పెద్ద లక్ష్యాల నుంచి కేవలం రేసులో ఉండటంపైకి మళ్లింది. మరి నిధికి అవకాశాలు వస్తాయో రావో చూడాలి.

Tags

Next Story