ఆ అగ్రిమెంట్ వల్ల చాలా ఆఫర్స్ వదలుకుంది !

ఆ అగ్రిమెంట్ వల్ల చాలా ఆఫర్స్ వదలుకుంది !
X
కరోనా టైమ్ లో ఈమె రెండు ప్రాజెక్టులకే పరిమితమవ్వడంతో.. అనేక కొత్త అవకాశాలను కోల్పోయింది.

టాలీవుడ్ బ్యూటీ నిధి అగర్వాల్ గత నాలుగేళ్లుగా కేవలం రెండు చిత్రాలతోనే ఆడియన్స్ మనసులో రిజిస్టర్ అయింది. టాలీవుడ్ లో టాప్ మోస్ట్ హీరోలతో పనిచేసే అవకాశం దక్కించుకున్నప్పటికీ.. కరోనా టైమ్ లో ఈమె రెండు ప్రాజెక్టులకే పరిమితమవ్వడంతో.. అనేక కొత్త అవకాశాలను కోల్పోయింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న "హరి హర వీర మల్లు" చిత్రంలో నిధి అగర్వాల్ కోవిడ్ ప్రారంభం అయ్యే నుంచే నటిస్తోంది. అంటే... ఈ సినిమాకి ఆమె మూడేళ్లు కాదు, ఏకంగా ఐదేళ్లుగా కేటాయించింది.

"హరి హర వీర మల్లు మేకర్స్ తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. ఈ సినిమా పూర్తయ్యే వరకు ఆమె కొత్త ప్రాజెక్ట్‌లను అంగీకరించకూడదు. అందుకే ఇతర సినిమాలు చేయలేదు. ‘హరి హర వీర మల్లు’ షూటింగ్ కొంతకాలం నిలిచిపోయినప్పుడు, ప్రభాస్ ‘ది రాజా సాబ్’ నుంచి మంచి అవకాశం వచ్చింది. అయితే, ఆ సినిమా చేయడానికి కూడా ‘హరి హర వీర మల్లు’ నిర్మాతల అనుమతి తీసుకున్న తర్వాతే సినిమా చేయడానికి ఒప్పుకుంది. ఈ రెండు చిత్రాలు భారీ ప్రాజెక్టులు కావడంతో.. వేరే సినిమాలకు ఆమెకు టైమ్ దొరకలేదు.

"హరి హర వీర మల్లు"లో తన పాత్ర పూర్తికావడంతో.. ఈ సంవత్సరం కొత్త చిత్రాలకు సంతకం చేయాలని నిధి భావిస్తోంది. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వం వహిస్తున్న "ది రాజా సాబ్", మరోవైపు "హరి హర వీర మల్లు" చివరి దశలో ఉంది. మొదట "హరి హర వీర మల్లు" ను మార్చి 28న, "ది రాజా సాబ్" ను ఏప్రిల్ 10న విడుదల చేయాలని భావించినా.. తాజా సమాచారం ప్రకారం, ఈ తేదీలు మారాయి. త్వరలో కొత్త విడుదల తేదీలను ప్రకటించనున్నారు. మరి నిధి అగర్వాల్ కొత్తగా ఒప్పుకున్న సినిమాలేంటో చూడాలి.

Tags

Next Story