టాలీవుడ్ లో కొత్త విలన్!

టాలీవుడ్ లో కొత్త విలన్!
X

టాలీవుడ్ లో కొత్త విలన్!ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా తెలుగులో హీరోగా సత్తా చాటిన వారిలో శివాజీ కూడా ఉంటాడు. బుల్లితెరపై వ్యాఖ్యాతగా ప్రస్థానాన్ని ప్రారంభించి.. ఆ తర్వాత వెండితెరపై చిన్న పాత్రల్లో మెరిసి.. హీరోగా వరుస సినిమాలు చేశాడు శివాజీ.

కారణాలేమైనా కానీ చాలా సంవత్సరాల పాటు సినిమాలకు దూరమయ్యాడు. మళ్లీ ‘90s మిడిల్ క్లాస్ బయోపిక్‘ శివాజీకి మంచి కమ్ బ్యాక్ గా నిలిచింది. అయితే అది ఓటీటీలో మాత్రమే. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పై శివాజీకి గ్రేట్ కమ్ గా అవ్వబోతుంది ‘కోర్ట్‘ మూవీ.

నాని నిర్మాణంలో రూపొందిన ‘కోర్ట్‘ మూవీ రేపు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అయితే ఈరోజే ఈ సినిమాకి చాలా చోట్ల ప్రీమియర్స్ పడ్డాయి. ప్రీమియర్ చూసిన జనాలు సినిమా గురించి ముందుగా ప్రస్తావిస్తుంది శివాజీ పోషించిన మంగపతి పాత్ర గురించి. ఈ పాత్రలో శివాజీ చూపించిన ఇంటెన్సిటీ గురించి ఎంత చెప్పినా తక్కువే అనే ప్రశంసలు దక్కుతున్నాయి. అతిగా ఆవేశపడే మంగపతి పాత్రలో శివాజీ మెలో డ్రామా లేకుండా, సహజంగా నటించడం ప్రేక్షకులను మరింత కట్టిపడేస్తుంది.

టాలీవుడ్‌లో విలన్‌ల కొరత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో, శివాజీ ఇప్పుడు విలన్‌గా నిలదొక్కుకునే ఆస్కారం ఉంది. జగపతిబాబు, శ్రీకాంత్ వంటి వారు సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్స్ గానూ అదరగొడుతున్నారు. ఇప్పుడు శివాజీ రూపంలో టాలీవుడ్ కి నయా విలన్ దొరికినట్టే.

Tags

Next Story