నానీ ‘హాయ్ నాన్న’ సినిమాపై వివాదం!

నానీ ‘హాయ్ నాన్న’ సినిమాపై వివాదం!
X
నిర్మాత పుష్కర మల్లికార్జునయ్య ఈ సినిమా నిర్మాతల్ని, నానిని నేరుగా ఉద్దేశించి ‘హాయ్ నాన్న’ తమ సినిమా కథను అనధికారికంగా కాపీ చేసి తీశారని ఆరోపించాడు.

2023లో విడుదలైన నేచురల్ స్టార్ నానీ నటించిన ‘హాయ్ నాన్న’ చిత్రం సూపర్ హిట్టైన సంగతి తెలిసిందే. మృణాళ్ ఠాకూర్ కథానాయికగా నటించిన ఈ రొమాంటిక్ డ్రామా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే సినిమా విడుదలైన ఏడాది తర్వాత.. ఈ చిత్రం కొత్త వివాదాన్ని రేపింది. ప్రముఖ కన్నడ నిర్మాత పుష్కర మల్లికార్జునయ్య ఈ సినిమా నిర్మాతల్ని, నానిని నేరుగా ఉద్దేశించి ‘హాయ్ నాన్న’ తమ సినిమా కథను అనధికారికంగా కాపీ చేసి తీశారని ఆరోపించాడు.

పుష్కర మల్లికార్జునయ్య తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ‘హాయ్ నాన్న’ పోస్టర్‌తో పాటు, కన్నడ చిత్రం ‘భీమ సేన నల మహారాజ’ పోస్టర్‌ను పంచుకున్నాడు. "రీమేక్ రైట్స్ తీసుకోకుండా మా ఒరిజినల్ మూవీ ‘భీమసేన నల మహారాజ’ను కాపీ చేసి ‘హాయ్ నాన్న’ తీసేశారు. ఇది ఎంత నీచమైన పని " అని నేరుగా నానిని టార్గెట్ చేస్తూ ఆరోపించాడు.

ఇప్పటి వరకు ఈ వివాదంపై ‘హాయ్ నాన్న’ చిత్రబృందం కానీ, నాని గానీ అధికారికంగా స్పందించలేదు. ఈ చిత్రానికి శౌర్యువ్ దర్శకత్వం వహించగా, ఇది వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మితమైంది. చిత్రం విడుదలైన వెంటనే తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా డబ్ చేశారు. సినిమా థియేట్రికల్ రన్ విజయవంతంగా పూర్తి చేసుకున్న తర్వాత.. 2024 జనవరి నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది. ఈ వివాదంపై ‘హాయ్ నాన్న’ టీమ్ నుండి స్పందన రావాల్సి ఉంది. ఇది నిజంగానే కాపీనా? లేక కేవలం ఆరోపణలేనా? అనేది చూడాలి!

Tags

Next Story