‘విశ్వంభర’ కోసం ప్రచారంలోకి కొత్త డేట్?

ఈ సంవత్సరం సంక్రాంతికి విడుదల కావాల్సిన మెగాస్టార్ చిరంజీవి చిత్రం ‘విశ్వంభర’ అనేక కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. మొదట ‘గేమ్ ఛేంజర్’ కారణంగా సినిమా విడుదల ఆలస్యమవగా, తరువాత వేసవి విడుదల కోసం ప్రయత్నించినా కొన్ని సాంకేతిక కారణాల వల్ల మరోసారి వెనక్కి వెళ్లింది.
తాజా సమాచారం ప్రకారం ‘విశ్వంభర’ ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో త్రిష కథానాయికగా నటించగా, యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుంది.
మరోవైపు ‘విశ్వంభర’కు సంబంధించిన డీల్స్ మాత్రం మంచి రేంజ్‌లో క్లోజ్ అవుతున్నట్టు తెలుస్తోంది. హిందీ డబ్బింగ్ హక్కులు మంచి ధరకు అమ్ముడవ్వగా, ఓటీటీ డీల్ కూడా దాదాపుగా ఖరారైనట్టే అనేది ఇన్సైడ్ టాక్. షూటింగ్ విషయానికొస్తే కేవలం రెండు పాటల చిత్రీకరణ బ్యాలెన్స్ ఉందట. అలాగే విజువల్ ఎఫెక్ట్స్ పనులకు మెరుగులు దిద్దడానికి ఈ సమయం ఉపయోగపడేలా చిత్రబృందం ప్లాన్ చేస్తోంది.
ఇక చిరంజీవి తదుపరి చిత్రంగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. 2026 సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు
-
Home
-
Menu