నయనతార పారితోషికం ఎంత ?

నయనతార పారితోషికం ఎంత ?
X
న‌య‌న‌తార‌కు ఈ చిత్రానికి అంత భారీ పారితోషికం చెల్లించ‌డం లేదని తెలుస్తోంది. వాస్తవానికి ఆమెకు ఫిక్స్ చేసిన రెమ్యూనరేషన్ దాదాపు రూ.6 కోట్లు మాత్రమేనని తాజా రిపోర్ట్స్ చెబుతున్నాయి.

ఇప్పటికే త‌మిళ హీరోయిన్ న‌య‌న‌తార ద‌క్షిణాది సినిమా పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే న‌టి అనే విషయం తెలిసిందే. త‌నకున్న మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగానే ఆమె భారీ రెమ్యూన‌రేషన్ వ‌సూలు చేస్తుంటుంది. ఇప్పుడు ఆమె మెగాస్టార్ చిరంజీవితో, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కబోయే తెలుగు చిత్రంలో నటించేందుకు సిద్ధమవుతోంది.

ఈ నేపథ్యంలో న‌య‌న‌తార‌కు ఈ చిత్రానికి సంబంధించి రూ.10 నుంచి 12 కోట్ల వరకు పారితోషికం చెల్లించబోతున్నారని కొన్ని మీడియా నివేదికలు వెల్లడించాయి. గతంలోనూ నయనతార ఒక సినిమాకు రూ.10 కోట్లు డిమాండ్ చేస్తున్నదన్న వార్తలు చాలాసార్లు వచ్చిన నేపథ్యంలో ఈ వార్తను నిజమేనేమోనని అంతా అనుకున్నారు.

అయితే తాజా సమాచారం ప్రకారం.. న‌య‌న‌తార‌కు ఈ చిత్రానికి అంత భారీ పారితోషికం చెల్లించ‌డం లేదని తెలుస్తోంది. వాస్తవానికి ఆమెకు ఫిక్స్ చేసిన రెమ్యూనరేషన్ దాదాపు రూ.6 కోట్లు మాత్రమేనని తాజా రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఇది ఒక సీనియర్, టాలెంటెడ్ నటి అయిన న‌య‌న‌తారకు సాధారణంగా ఇచ్చే పారితోషికంగా పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

ఇదిలా ఉండగా, డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇటీవలే చెన్నైలో న‌య‌న‌తార‌తో కలిసి ఓ అనౌన్స్మెంట్ వీడియోను షూట్ చేసినట్లు సమాచారం. ఆమె ఈ ప్రాజెక్టులో త్వరలోనే షూటింగ్‌లో కూడా పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. ఈ వీడియో ద్వారా న‌య‌న‌తార అధికారికంగా ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన చేయనున్నారు.

తాజా అప్‌డేట్స్ ప్రకారం, మే 22న ప్రారంభమయ్యే కొత్త షెడ్యూల్ నుంచి న‌య‌న‌తార షూటింగ్‌లో జాయిన్ అవుతారని సమాచారం. దీంతో మెగా అభిమానుల్లో ఈ ప్రాజెక్టుపై ఆసక్తి మరింతగా పెరుగుతోంది.

Tags

Next Story