మెగా 157 షూట్ లో జాయిన్ అయిన నయనతార

మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఓ పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ 2026 సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. చిరుకి జోడీగా సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ నయనతార నటిస్తోంది. ఇది ఫ్యాన్స్‌లో మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం రెండో షెడ్యూల్ షూటింగ్ ఉత్తరాఖండ్‌లోని ముస్సోరీలో జరుగుతోంది. ముస్సోరీలోని హరితవనాలు, సుందరమైన లొకేషన్స్ ఈ సినిమాకి విజువల్ ట్రీట్‌గా నిలవనున్నాయి.
చిరంజీవి, ఇతర కీలక నటీనటులు ఇప్పటికే షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. అయితే తాజాగా నయనతార కూడా సెట్స్‌లోకి ఎంటరైంది. ఈ షెడ్యూల్‌లో చిరు-నయనతారల మధ్య కొన్ని క్రూషియల్ సీన్స్‌తో పాటు, ఓ హై-ఎనర్జీ సాంగ్ సీక్వెన్స్‌ని కూడా చిత్రీకరిస్తున్నారు. ఈ పాట ఫ్యాన్స్‌కి విజువల్‌గా, ఆడియో పరంగా కూడా కిక్కిచ్చేలా ఉండబోతుందని అంటున్నారు.
ఈ భారీ ప్రాజెక్ట్‌ను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ నుంచి సుష్మిత కొణిదెల కలిసి నిర్మిస్తున్నారు. సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా స్కేల్‌కి తగ్గట్టు మాస్‌కి ఆకట్టుకునే, ఎనర్జిటిక్ ట్యూన్స్‌తో సౌండ్‌ట్రాక్ రూపొందించబోతున్నారు. చిరు సినిమాకి భీమ్స్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటలు ఖచ్చితంగా థియేటర్లలో గూస్‌బంప్స్ తెప్పించేలా ఉంటాయని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
-
Home
-
Menu