సెట్స్ లోకి అడుగుపెట్టబోతోంది !

సెట్స్ లోకి అడుగుపెట్టబోతోంది !
X
సౌత్ క్వీన్ నయనతార ఈ ఫేజ్‌లో మొదటిసారి సెట్స్‌పై జాయిన్ కాబోతోందని లేటెస్ట్ బజ్. ఇది ఫ్యాన్స్‌లో హైప్‌ని రెట్టింపు చేస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా... బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ త్వరలోనే కొత్త షెడ్యూల్‌ని కిక్‌స్టార్ట్ చేయబోతోంది. ఈ ప్రాజెక్ట్ అప్‌డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. ఈ షెడ్యూల్‌ని మరింత స్పెషల్ చేస్తూ, సౌత్ క్వీన్ నయనతార ఈ ఫేజ్‌లో మొదటిసారి సెట్స్‌పై జాయిన్ కాబోతోందని లేటెస్ట్ బజ్. ఇది ఫ్యాన్స్‌లో హైప్‌ని రెట్టింపు చేస్తోంది.

సోర్సెస్ ప్రకారం.. ఈ షెడ్యూల్‌లో చిరంజీవి, నయనతార కలిసి అనిల్ రావిపూడి సిగ్నేచర్ స్టైల్‌లోని ఫుల్ ఫన్‌ఫిల్డ్ కామెడీ సీన్స్‌ని షూట్ చేయనున్నారు. అనిల్ రావిపూడి అంటేనే కడుపుబ్బా నవ్వించే కామెడీ టైమింగ్, మాస్ ఎంటర్‌టైన్‌మెంట్ అని అందరికీ తెలుసు.

చిరంజీవి లెజెండరీ చారిష్మాతో, నయనతార గ్లామర్‌తో మిక్స్ అయితే థియేటర్లలో ఎలాంటి మాయాజాలం జరుగుతుందో ఊహించుకోండి. ఈ కాంబో నుంచి ఫుల్ ఆన్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజ్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్న ఫ్యాన్స్‌కి ఈ అప్‌డేట్ ఖచ్చితంగా పండగలా ఉంటుంది. మరి ఈ సినిమా బాక్సాఫీస్‌ని ఎలా షేక్ చేస్తుందో చూడాలి.

Tags

Next Story