‘మ్యాడ్’ బాయ్ కు జోడీగా ‘ఆయ్’ బ్యూటీ!

‘మ్యాడ్’ బాయ్ కు జోడీగా ‘ఆయ్’ బ్యూటీ!
X
ఇప్పుడు నయన్ మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌లో బిజీ అవుతోంది. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సంగీత్ శోభన్‌తో జోడీ కడుతూ.. కొత్త సినిమాలో నటిస్తోంది.

అందాల తెలుగు అమ్మాయి నయన సారిక ఈ మధ్య కాలంలో రెండు సినిమాలతో ఓ రేంజ్‌లో సందడి చేసింది. కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన “క”, నార్ని నితిన్ హీరోగా నటించిన “ఆయ్” సినిమాల్లో లీడ్ రోల్‌లో మెరిసింది. ఈ రెండూ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్స్‌గా నిలిచాయి. నయన యాక్టింగ్ స్కిల్స్, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆడియన్స్‌ని ఫిదా చేసి, ఒక్కసారిగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది.

ఇప్పుడు నయన్ మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌లో బిజీ అవుతోంది. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సంగీత్ శోభన్‌తో జోడీ కడుతూ.. కొత్త సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాకి మానస శర్మ డైరెక్టర్. మానస శర్మ స్టోరీ టెల్లింగ్ స్టైల్ గురించి ఇప్పటికే చిన్నపాటి బజ్ క్రియేట్ అవుతోంది. అందుకే ఈ మూవీపై అంచనాలు ఇప్పటినుంచే పెరుగుతున్నాయి.

ఈ చిత్రాన్ని నిహారిక కొణిదెల తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తోంది. “కమిటీ కుర్రోళ్లు” సినిమాతో నిర్మాతగా సక్సెస్‌ఫుల్ ఎంట్రీ ఇచ్చిన నిహారిక, ఇప్పుడు ఈ సినిమాతో తన సక్సె్స్ జెర్నీని కొనసాగిస్తోంది. ఆమె నిర్మాణంలోని క్వాలిటీ, డిఫరెంట్ స్టోరీలను సెలెక్ట్ చేసే విజన్‌తో ఈ సినిమాపై కూడా భారీ హైప్ క్రియేట్ అవుతోంది. ఇక సంగీత్ శోభన్ గురించి చెప్పాలంటే, ఈ యంగ్ హీరో ఇటీవల “మ్యాడ్” ఫ్రాంచైజీతో యూత్‌లో ఫుల్ క్రేజ్ సంపాదించాడు. ఆ సినిమా ఫన్, ఎమోషన్స్, ఎంటర్‌టైన్‌మెంట్ మిక్స్‌తో ఆడియన్స్‌ని అలరించింది. ఇప్పుడు ఈ కొత్త ప్రాజెక్ట్‌లో సంగీత్, నయన్ కెమిస్ట్రీ ఎలా వర్కౌట్ అవుతుందో చూడాలి.

Tags

Next Story