‘బిగ్ బాస్ 9’ హోస్ట్ గా బాలయ్య?

‘బిగ్ బాస్ 9’ హోస్ట్ గా బాలయ్య?
X
ఇప్పుడు, బాలకృష్ణను “బిగ్ బాస్ తెలుగు” కొత్త సీజన్‌కు హోస్ట్‌గా తీసుకోవాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు ఆరు సీజన్లు నాగార్జున అక్కినేని హోస్ట్ చేశారు. ప్రస్తుతం నాగార్జున విశ్రాంతి తీసుకోవాలని భావిస్తున్నారు.

నందమూరి బాలకృష్ణ టీవీ హోస్ట్‌గా కూడా తన ప్రతిభ ఎలాంటిదో ఇప్పటికే నిరూపించారు. “అన్‌స్టాపబుల్” చిట్‌చాట్ షో ద్వారా ఆయన యువతలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. ఈ షో తర్వాత బాలయ్యకు అనేక బ్రాండ్ అంబాసిడర్ అవకాశాలు కూడా లభించాయి. ఇప్పుడు, బాలకృష్ణను “బిగ్ బాస్ తెలుగు” కొత్త సీజన్‌కు హోస్ట్‌గా తీసుకోవాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు ఆరు సీజన్లు నాగార్జున అక్కినేని హోస్ట్ చేశారు. ప్రస్తుతం నాగార్జున విశ్రాంతి తీసుకోవాలని భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో "బిగ్ బాస్" టీం రియాలిటీ షోకు కొత్త ఉత్సాహాన్ని తీసుకు రావాలని భావించి కొత్త హోస్ట్ కోసం ప్రయత్నిస్తోంది. ప్రారంభంలో విజయ్ దేవరకొండను తీసుకోవాలి అనుకున్నారని సమాచారం. అయితే ఇప్పుడు నందమూరి బాలకృష్ణకే అధిక అవకాశం కనిపిస్తోంది. “బిగ్ బాస్ తెలుగు 9” టీం ఇప్పటికే బాలయ్యతో పాటు.. ఆయన వ్యాపార వ్యవహారాలను చూసుకునే కుమార్తె తేజస్వినిని కూడా సంప్రదించిందని సమాచారం.

ప్రస్తుతం బాలకృష్ణ “అఖండ 2” షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అదే సమయంలో, గోపిచంద్ మలినేని దర్శకత్వంలో మరో కొత్త సినిమాకు కూడా బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బాలయ్య "బిగ్ బాస్" హోస్ట్‌గా అంగీకరిస్తారా లేదా అన్నది త్వరలో తేలనుంది. ఒకవేళ కానీ ఇది వర్కవుట్ అయితే.. బిగ్ బాస్ 9వ సీజన్ మరింత ప్రత్యేకత సంతరించుకుంటుందని వేరే చెప్పాలా.

Tags

Next Story