జపాన్ లో రీరిలీజ్ కానున్న ‘మనం’

జపాన్ లో రీరిలీజ్ కానున్న ‘మనం’
X
జపాన్ ఫ్యాన్స్ కోసం నాగార్జున ఒక స్పెషల్ మూవ్‌తో.. జపాన్‌లో జరిగే ఒక స్క్రీనింగ్‌కి వర్చువల్‌గా జాయిన్ అయి.. ఆడియన్స్‌తో చాట్ చేయనున్నారు.

అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, దివంగత ఎ.ఎన్.ఆర్. లీడ్ రోల్స్‌లో నటించిన సూపర్ హిట్ మూవీ “మనం”. 2014 మే 23న టాలీవుడ్ లో రిలీజైన దాదాపు పదేళ్ల తర్వాత, జపాన్‌లో ఆగస్టు 8, 2025న థియేటర్లలో రీ-రిలీజ్ కాబోతోంది. విక్రమ్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా తెలుగు ఆడియన్స్‌కి టోటల్ ఫేవరెట్‌గా మారింది.

జపాన్ ఫ్యాన్స్ కోసం నాగార్జున ఒక స్పెషల్ మూవ్‌తో.. జపాన్‌లో జరిగే ఒక స్క్రీనింగ్‌కి వర్చువల్‌గా జాయిన్ అయి.. ఆడియన్స్‌తో చాట్ చేయనున్నారు. జపాన్‌లో నాగార్జునకి ఇప్పటికీ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

“మనం” సినిమా అక్కినేని ఫ్యామిలీలో మూడు జనరేషన్స్‌ని స్క్రీన్‌పై కలిపిన ఐకానిక్ మూవీ. దివంగత అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్య, అఖిల్ అక్కినేని ఈ సినిమాలో నటించారు. ఇది తెలుగు సినిమా ఇండస్ట్రీలో లెజెండరీగా, అక్కినేని ఫ్యామిలీకి స్పెషల్‌గా నిలిచింది.

ఈ రీ-రిలీజ్, ముఖ్యంగా జపాన్‌లో తెలుగు సినిమాని బిగ్ స్క్రీన్‌పై చూసే చాన్స్ రేర్‌గా దొరికే ఫ్యాన్స్‌కి, టోటల్ నాస్టాల్జిక్ వైబ్‌తో కూడిన సెలబ్రేషన్‌గా ఉండబోతోంది. మరి జపాన్ జనానికి మన మనం మూవీ ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి.

Tags

Next Story