మళ్లీ ఒక ఫ్రేమ్ లో అక్కినేని త్రయం ?

అక్కినేని అభిమానులకు ఒక శుభవార్త. అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, అఖిల్ మళ్ళీ ఒకే సినిమాలో కనిపించబోతున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. నాగార్జున 100వ సినిమాలో ఈ ముగ్గురూ కలిసి నటించనున్నారు. పదేళ్ల క్రితం వచ్చిన 'మనం' సినిమాలో ఈ తరం అక్కినేని హీరోలందరూ ఒకే తెరపై కనిపించారు. అక్కినేని నాగేశ్వరరావు గారికి అది చివరి సినిమా. ఆ సినిమా అక్కినేని అభిమానులకు ఒక గొప్ప అనుభూతినిచ్చింది.
ఇప్పుడు, ఆ మ్యాజిక్‌ను నాగార్జున తన ప్రతిష్టాత్మకమైన 100వ సినిమా 'కింగ్ 100' తో రిపీట్ చేయబోతున్నారు. ఈ సినిమాలో నాగ చైతన్య, అఖిల్ అతిథి పాత్రల్లో కనిపించనున్నారని సమాచారం. తమిళ దర్శకుడు రా కార్తీక్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా ఒక మాస్, ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రూపొందనుంది. ప్రస్తుతం, నాగార్జున బిగ్ బాస్ సీజన్ 9కి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇది పూర్తవగానే ఆయన తన 100వ సినిమా షూటింగ్‌లో పాల్గొంటారు.
ఈ ఏడాదిలో నాగార్జున ‘కుబేరా’, ‘కూలీ’ చిత్రాలలో కీలక పాత్రల్లో కనిపించి మంచి మార్కులు కొట్టేశారు. ఇప్పుడు, చాలా కాలం తర్వాత పూర్తిస్థాయి నాయకుడిగా ఆయన ఈ సినిమాతో తిరిగి వస్తున్నారు. తన 100వ సినిమాను అభిమానులకు ఒక మంచి ట్రీట్‌గా ఇవ్వాలని నాగార్జున గట్టిగా భావిస్తున్నారు. అందుకే ఈ సినిమాలో చైతన్య, అఖిల్‌లకు చిన్న పాత్రలు రాసినట్లు తెలుస్తోంది. ఈ విషయం అధికారికంగా ప్రకటిస్తే అక్కినేని అభిమానులకు పండగే అని చెప్పవచ్చు.
-
Home
-
Menu