రియల్ షో స్టీలర్.. నాగార్జునే !

రియల్ షో స్టీలర్..  నాగార్జునే !
X
సినిమాలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాడు. తన కెరీర్‌లో మొదటిసారి నాగార్జున పూర్తి స్థాయి నెగెటివ్ రోల్‌లో కనిపించాడు. సైమన్ అనే కోల్డ్, క్యాల్కులేటెడ్ క్యారెక్టర్‌గా అతని స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోయింది.

‘కూలీ’ సినిమా ఫైనల్‌గా రిలీజ్ అయింది. సినిమాపై అభిప్రాయాలు మిక్స్‌డ్‌గా ఉన్నా.. ఒక విషయం మాత్రం అందరూ ఒకేలా మెచ్చుకుంటున్నారు. నాగార్జున అక్కినేని సీన్ స్టీలర్ పెర్ఫార్మెన్స్. ‘ఐ యామ్ ది డేంజర్’.. అనే హై-ఎనర్జీ ట్రాక్‌లో నాగ్ తన స్టైల్, స్వాగ్‌తో స్క్రీన్‌ని రూల్ చేశాడు. సినిమాలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాడు. తన కెరీర్‌లో మొదటిసారి నాగార్జున పూర్తి స్థాయి నెగెటివ్ రోల్‌లో కనిపించాడు. సైమన్ అనే కోల్డ్, క్యాల్కులేటెడ్ క్యారెక్టర్‌గా అతని స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోయింది.

ఫ్యాన్స్, క్రిటిక్స్ అందరూ అతన్ని "రియల్ షో స్టీలర్" అంటూ కితాబిస్తున్నారు, సినిమాకి ఫ్రెష్ ఎనర్జీ జోడించిన క్రెడిట్ అతనిదే. అనిరుధ్ ఎనర్జిటిక్ స్కోర్‌తో ‘ఐయామ్ ది డేంజర్ ’ ట్రాక్ నాగ్‌ లార్జర్ దన్ లైఫ్ అప్పీల్‌ని మరింత హైలైట్ చేసింది. సినిమాలోని బెస్ట్ మూమెంట్స్‌లో ఒకటిగా నిలిచింది. కెరీర్‌లో ఈ బోల్డ్ షిఫ్ట్‌కి అందరూ ఫిదా అవుతున్నారు, ఇది రీసెంట్ టైమ్స్‌లో బెస్ట్ కాస్టింగ్ డెసిషన్స్‌లో ఒకటిగా ప్రశంసలు అందుకుంటోంది.

సోషల్ మీడియాలో నాగ్ ట్రాన్స్‌ఫర్మేషన్, నెగెటివ్ రోల్‌ని ధైర్యంగా ఒప్పుకున్న తీరుకి ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ న్యూ అవతార్ టోటల్‌గా రిఫ్రెషింగ్ అని, అతను ఈ రోల్‌ని పర్ఫెక్ట్‌గా ఓన్ చేశాడని అంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే... ‘కూలీ’ సినిమా నాగార్జున ఒక ఐకానిక్ వెర్షన్‌ని ఫ్యాన్స్‌కి అందించింది. దీన్ని ఎప్పటికీ మర్చిపోలేరు.

Tags

Next Story