కింగ్ 100వ సినిమా లాంచింగ్ అప్పుడే !

కింగ్ 100వ సినిమా లాంచింగ్ అప్పుడే  !
X
నాగార్జున తెలిపిన వివరాల ప్రకారం.. ఈ చిత్రం కోసం ఆయన ‘నీతం ఒరు వానం’ ఫేమ్ దర్శకుడు రా కార్తీక్‌ దర్శకత్వంలో ఒక సినిమాలో ఆయన నటించబోతున్నారు.

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘కూలీ’ సినిమాలో విలన్‌గా తొలిసారిగా కింగ్ నాగార్జున పరిచయమైన సంగతి తెలిసిందే. తన నాలుగు దశాబ్దాల సినీ ప్రస్థానంలో ఇప్పటికీ ఆయన మెరుస్తూనే ఉన్నారు. ఇటీవల ఆయన జీ 5 ఛానల్, ఓటీటీలో జరిగిన ‘జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతి’ షోకి చీఫ్ గెస్ట్‌గా హాజరై.. తన 100వ సినిమా గురించి ఆసక్తికరమైన వివరాలను వెల్లడించారు నాగ్.

నాగార్జున తెలిపిన వివరాల ప్రకారం.. ఈ చిత్రం కోసం ఆయన ‘నీతం ఒరు వానం’ ఫేమ్ దర్శకుడు రా కార్తీక్‌ దర్శకత్వంలో ఒక సినిమాలో ఆయన నటించబోతున్నారు. గత ఏడు నెలలుగా ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతు న్నాయని, ఈ సినిమా యాక్షన్‌తో నిండి ఉంటుందని ఫ్యాన్స్‌కి హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్‌ను ఆయన పుట్టినరోజైన ఆగస్టు 29, 2025న గ్రాండ్‌గా లాంచ్ చేయనున్నట్లు సమాచారం.

ఇదిలా ఉండగా... నాగార్జున ఐకానిక్ క్లాసిక్ చిత్రం ‘శివ’ సెప్టెంబర్ 2025లో 4K ఫార్మాట్‌లో రీ-రిలీజ్ కానుంది. ఖచ్చితమైన తేదీ త్వరలో ప్రకటించ నున్నారు. తన 100వ సినిమా, బిగ్ బాస్ 9 హోస్టింగ్ వంటి బాధ్యతలతో నాగార్జున షెడ్యూల్ ఎంతో బిజీగా ఉంది.

Tags

Next Story