‘కింగ్ 100’ అనౌన్స్ మెంట్ ఎప్పుడు?

‘కింగ్ 100’ అనౌన్స్ మెంట్ ఎప్పుడు?
X
తమిళ దర్శకుడు రా కార్తీక్ ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. నాగార్జున స్వయంగా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై దీన్ని నిర్మించనున్నారు.

నాగార్జున అక్కినేని ఈ రోజు తన 66వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా, అభిమానులు ఆయన కెరీర్‌లో మైలురాయిగా నిలిచే 100వ చిత్రం ‘కింగ్100’ గురించి ప్రకటన వస్తుందని ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే, నాగార్జున ఈ అంచనాలను పక్కనపెట్టి.. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌కు తనను విష్ చేయడానికి వచ్చిన అభిమానులతో సమావేశమై, వారితో సంతోషంగా గడిపారు.

‘కింగ్100’ గురించి అధికారిక ప్రకటన ఆలస్యం అవుతున్నప్పటికీ, ఈ చిత్రానికి దర్శకుడు, నిర్మాణ సంస్థ ఇప్పటికే ఖరారైనట్లు తెలుస్తోంది. తమిళ దర్శకుడు రా కార్తీక్ ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. నాగార్జున స్వయంగా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై దీన్ని నిర్మించనున్నారు. ప్రకటన ఆలస్యం కావడానికి కారణం ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఇదిలా ఉంటే.. నాగార్జున సెప్టెంబర్ 7, 2025న ప్రారంభం కానున్న బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్‌ను హోస్ట్ చేయడానికి సిద్ధమవుతున్నారు.

ఈ ఏడాది, నాగార్జున రెండు చిత్రాల్లో కనిపించారు "కుబేరా"లో కీలక సహాయ పాత్రలో, అలాగే.. "కూలీ"లో విలన్ సైమన్‌గా నటించారు. చాలా కాలం తర్వాత, అభిమానులు నాగార్జునను మళ్లీ ప్రధాన పాత్రలో చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Tags

Next Story