చైతూ కొత్త సినిమా టైటిల్ ఇదేనా?

చైతూ కొత్త సినిమా టైటిల్ ఇదేనా?
X
ఈ సినిమాకు "వృషకర్మ" అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారనే వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

నాగచైతన్యకు ఎంతో అవసరమైన విజయాన్ని అందించిన దేశభక్తి రొమాంటిక్ డ్రామా "తండేల్" ఆయన కెరీర్‌లో హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. చందూ మోండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఘన విజయం సాధించడంతో చైతూ ఇప్పుడు తన 24వ సినిమాపై దృష్టి పెట్టాడు.

‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం ఒక పౌరాణిక థ్రిల్లర్. భారీ బడ్జెట్‌తో నిర్మించబోయే ఈ చిత్రంలో అదిరిపోయే విజువల్ ఎఫెక్ట్స్ ఉండబోతున్నాయి. కథ పరంగా ఇది ట్రెజర్ హంట్ అడ్వెంచర్ జానర్‌లో తెరకెక్కుతుందని స్వయంగా నాగచైతన్య వెల్లడించాడు. ఇది తను ఇప్పటి వరకు చేసిన చిత్రాల్లో అత్యంత భారీ ప్రాజెక్ట్ అని కూడా పేర్కొన్నాడు.

ఈ సినిమాకు "వృషకర్మ" అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారనే వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థలు శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర మరియు సుకుమార్ రైటింగ్స్ కలిసి ఈ సినిమాను నిర్మించనున్నాయి. హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి ఎంపికయ్యే అవకాశముందని సమాచారం.

అలాగే, ఇటీవలే "లాపతా లేడీస్" చిత్రంతో ప్రశంసలు పొందిన స్పర్శ్ శ్రీవాస్తవ ఇందులో ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. సంగీత దర్శకుడిగా అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించనున్నారు. నాగచైతన్య అభిమానులు ఈ మైథలాజికల్ అడ్వెంచర్‌పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. “తందేల్” విజయాన్ని కొనసాగిస్తూ “వృషకర్మ” కూడా ఆయన కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవాలని ఆశిస్తున్నారు.

Tags

Next Story