సూపర్ స్టార్ తో నాగ్ అశ్విన్?

సూపర్ స్టార్ తో నాగ్ అశ్విన్?
X
నాగ్ అశ్విన్ సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను కలిసి ఓ కథాంశం వినిపించారని రూమర్స్ షికారు చేస్తున్నాయి.

మైథో సై-ఫై ఎంటర్‌టైనర్ కల్కి 2898 ఏడీతో దర్శకుడు నాగ్ అశ్విన్ అద్భుతమైన హిట్ సాధించారు. ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ. 1100 కోట్లు వసూలు చేసింది. రెండో భాగం కోసం అభిమానుల్లో ఉత్సాహం ఓ రేంజ్‌లో ఉంది. అయితే, ప్రభాస్ బిజీ షెడ్యూల్ కారణంగా కల్కి 2898 ఏడీ: పార్ట్ 2 షూటింగ్ మొదలయ్యేందుకు కొంత సమయం పట్టనుంది.

ఈ గ్యాప్‌లో నాగ్ అశ్విన్ మరో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని నెలల క్రితం బాలీవుడ్ నటి ఆలియా భట్‌తో ఆయన చర్చలు జరిపినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా, నాగ్ అశ్విన్ సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను కలిసి ఓ కథాంశం వినిపించారని రూమర్స్ షికారు చేస్తున్నాయి. రజనీకి ఈ కాన్సెప్ట్ నచ్చినట్లు, పూర్తి స్క్రిప్ట్‌తో రమ్మని ఆయన ఈ యంగ్ డైరెక్టర్‌ను కోరినట్లు సమాచారం.

ఇంతకుముందు తెలుగు దర్శకుడు వివేక్ ఆత్రేయ కూడా రజనీతో సినిమా గురించి మాట్లాడారు, కానీ ఆ ప్రాజెక్ట్‌లో ఎలాంటి పురోగతి లేదు. నాగ్ అశ్విన్‌తో రజనీకాంత్ కలిసి పనిచేస్తారా లేక ఇది కేవలం ఊహాగానమేనా అనేది చూడాలి.

Tags

Next Story