టాలీవుడ్ న్యూ రాక్ స్టార్ గౌరహరి

2015లో ‘తుంగభద్ర’ సినిమాతో మ్యూజిక్ కంపోజర్‌గా డెబ్యూ చేశాడు గౌర హరి. ఆ తర్వాత చాలా ప్రాజెక్ట్‌లలో పనిచేసినా.. చాలా వరకు అనుకున్న స్థాయిలో హిట్ కాలేదు , అతను ఆశించిన గుర్తింపు రాలేదు. అయితే తేజ సజ్జా నటించిన ‘హనుమాన్’ సినిమాతో అంతా మారిపోయింది. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అయింది.
గౌరహరి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హనుమాన్ సక్సెస్‌లో కీలక పాత్ర పోషించింది. అతని శక్తివంతమైన మ్యూజిక్ ప్రేక్షకులకు ఎమోషనల్ ఇంపాక్ట్ ఇచ్చి, గూస్‌బంప్స్ తెప్పించింది. ఈ సినిమా అతని కెరీర్‌లో టర్నింగ్ పాయింట్ అయ్యింది. అతని నిజమైన టాలెంట్‌ని ప్రపంచానికి చూపించింది. ఇక లేటెస్ట్ గా తేజ సజ్జా నటించిన ‘మిరాయ్’ సినిమాతో గౌరహరి మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. శుక్రవారం రిలీజైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది.
గౌరహరి మ్యూజిక్ ‘మిరాయ్’ సినిమాకి ఆయువుపట్టుగా మారింది. ఒరిజినల్ స్కోర్ కోసం అతను నెలల తరబడి కష్టపడ్డాడు. ప్రతి సీన్‌లో సరైన ఎమోషన్ వచ్చేలా చూశాడు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి హైలైట్‌గా నిలిచింది. అలాగే ఆడియో సాంగ్స్ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ‘మిరాయ్’ సక్సెస్‌తో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ హౌస్ గౌరహరి ను తమ ఫ్యూచర్ ప్రాజెక్ట్‌ల కోసం ఫిక్స్ చేసింది. ఇప్పుడు ఆఫర్లు వెల్లువలా వస్తున్నాయి. ఇండస్ట్రీ అతన్ని ఈ జనరేషన్‌లో మోస్ట్ ప్రామిసింగ్ కంపోజర్స్‌లో ఒకడిగా చూస్తోంది.
-
Home
-
Menu