ధనుష్ కేవలం స్నేహితుడు మాత్రమే : మృణాళ్ ఠాకూర్

గాసిప్ కాలమ్స్, సోషల్ మీడియాలో మృణాళ్ ఠాకూర్ అండ్ ధనుష్ మధ్య ఏదో ఉందనే చర్చలు జోరుగా సాగాయి. మృణాళ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ధనుష్ సోదరీ మణులను ఫాలో చేయడం మొదలుపెట్టడంతో ఈ ఊహాగానాలు మరింత బలపడ్డాయి. చాలామంది వీరిద్దరి మధ్య స్నేహం కంటే ఏదో ఎక్కువ ఉందని భావించారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మృణాళ్ ఈ ఊహాగానాలకు తెరదించారు. ధనుష్ తనకు “కేవలం స్నేహితుడు” మాత్రమేనని.. అంతకు మించి ఏమీ లేదని స్పష్టం చేశారు. అలాగే, తన సినిమా ఈవెంట్‌లలో ధనుష్ కనిపించడం గురించి వచ్చిన చర్చలను కూడా క్లారిఫై చేశారు. అతన్ని తాను ఆహ్వానించలేదని, నటీనటులైన అతని స్నేహితులు ఆహ్వానించారని చెప్పారు. ఈ వ్యాఖ్యలతో ఊహాగానాలు చాలావరకు సమసిపోయినప్పటికీ, ధనుష్ సోదరీమణులను ఎందుకు ఫాలో చేయడం మొదలుపెట్టారనే విషయంపై మృణాళ్ ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు.
ధనుష్.. 18 ఏళ్ల వివాహ జీవితం తర్వాత ఐశ్వర్యతో విడాకులు తీసుకున్నాడు. మృణాళ్ ఈవెంట్‌లలో రెండు సార్లు కనిపించాడు. మరోవైపు, మృణాళ్ తన చివరి బ్రేకప్ తర్వాత సింగిల్‌గా ఉన్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ధనుష్ ప్రస్తుతం తన రాబోయే తమిళ సినిమాలతో బిజీగా ఉన్నాడు. అటు మృణాళ్ అడివి శేష్‌తో కలిసి నటిస్తున్న తన తదుపరి తెలుగు చిత్రం ‘డెకాయిట్’ విడుదల కోసం ఎదురుచూస్తోంది.
-
Home
-
Menu