మళ్ళీ తెలుగులో మోహన్ లాల్ ?

కంప్లీట్ యాక్టర్ మోహన్‌లాల్ ప్రస్తుతం తన కొత్త సినిమా ‘ఎంపురాన్’ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా ఆయనకు తాజాగా హైదరాబాదులో ఉన్నప్పుడు.. తెలుగు ప్రేక్షకులకు స్ట్రైట్ సినిమాతో మళ్లీ వస్తారా అనే ప్రశ్న ఎదురైంది. ఇటీవల ఆయన రామ్ పోతినేని 22వ చిత్రంలో భాగం అవుతారనే వార్తలు వినిపించాయి. మహేశ్ బాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మోహన్‌లాల్ కీలక పాత్ర పోషించనున్నారని ప్రచారం జరుగుతోంది.
అంతేకాక, రామ్ నటిస్తున్న మరో సినిమాకు కూడా మోహన్‌లాల్ పేరు వినిపిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కూడా ఆయన నటిస్తున్నారా? అనే ప్రశ్నకు స్పందిస్తూ, "చర్చలు జరుగుతున్నాయి, కానీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు," అని మోహన్‌లాల్ క్లారిటీ ఇచ్చారు.
తెలుగు సినీ పరిశ్రమలో మోహన్‌లాల్‌కి మంచి గుర్తింపు ఉంది. ఆయన స్ట్రైట్ తెలుగు సినిమా మనమంతా ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అంతకంటే ముందే, బాలకృష్ణ-ఏఎన్ఆర్ నటించిన గాండీవం చిత్రంలో ఓ ప్రత్యేక గీతంలో కనిపించారు. ఆ తర్వాత ఎన్టీఆర్‌తో కలిసి జనతా గ్యారేజ్ లో కీలక పాత్ర పోషించి, మరింతగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన ప్రధాన పాత్రలో నటించిన ఎంపురాన్ సినిమా పృధ్విరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమా ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
-
Home
-
Menu