ఓవర్సీస్ ప్రీ సేల్స్ లో ‘మిరాయ్’ దూకుడు !

ఓవర్సీస్ ప్రీ సేల్స్ లో ‘మిరాయ్’ దూకుడు !
X
రేపు థియేటర్లలోకి రానున్న ఈ హైలీ యాంటిసిపేటెడ్ సూపర్ హీరో ఎంటర్‌టైనర్ ఇప్పటికే భారీ బజ్ క్రియేట్ చేసింది. ప్రీమియర్ షోలకు ముందే టికెట్ సేల్స్ 100 కే డాలర్స్ మార్క్‌ను దాటేసాయి.

"మిరాయ్" సినిమా ఉత్తర అమెరికా ప్రీమియర్ కోసం కౌంట్‌డౌన్ షురూ అయింది. రేపు థియేటర్లలోకి రానున్న ఈ హైలీ యాంటిసిపేటెడ్ సూపర్ హీరో ఎంటర్‌టైనర్ ఇప్పటికే భారీ బజ్ క్రియేట్ చేసింది. ప్రీమియర్ షోలకు ముందే టికెట్ సేల్స్ 100 కే డాలర్స్ మార్క్‌ను దాటేసాయి. ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్ అంచనా ప్రకారం.. "మిరాయ్" ఓపెనింగ్ ప్రీమియర్ల నుంచి 200 కే డాలర్స్ నుంచి 250 కే డాలర్స్ వరకూ కలెక్ట్ చేయొచ్చు.

ఇప్పటి ట్రెండ్స్ చూస్తే.. ఓవర్సీస్‌లో సినిమాకు బలమైన రెస్పాన్స్ ఖాయంగా కనిపిస్తోంది. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్‌లో తెరకెక్కిన "మిరాయ్" ప్రధానంగా సూపర్ హీరో యాక్షన్ ఫిల్మ్ అయినప్పటికీ, మైథాలజీని జోడించడంతో ప్రత్యేకంగా నిలుస్తోంది. శ్రీరాముడి ప్రభావం కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే తేజ సజ్జా తల్లిగా శ్రియ నటించిన ఎమోషనల్ తల్లీ-కొడుకు బంధం సినిమాకు హైలైట్.

తేజ సజ్జా "మిరాయ్" పై గట్టి ఆశలు పెట్టుకుని, సినిమా ప్రమోషన్‌లో యాక్టివ్‌గా పాల్గొంటున్నాడు. హీరోయిన్ రితికా నాయక్ కూడా ప్రమోషన్స్‌లో కీలక పాత్ర పోషిస్తోంది. అంతేకాదు, విలన్‌గా నటిస్తున్న మంచు మనోజ్ తన ఇంపాక్ట్‌ఫుల్ స్టేట్‌మెంట్స్‌తో హైప్‌ను పెంచుతున్నాడు. ఇలాంటి ఊపుతో "మిరాయ్" యూఎస్ బాక్సాఫీస్‌లో గట్టి మార్క్ వేయడానికి సిద్ధంగా ఉంది.

Tags

Next Story