అనిల్ దర్శకత్వంలో మెగాస్టార్ డబుల్ ట్రీట్!

అనిల్ దర్శకత్వంలో మెగాస్టార్ డబుల్ ట్రీట్!
X

మెగాస్టార్ చిరంజీవి కాస్త గ్యాప్ తర్వాత పూర్తి స్థాయి వినోదభరిత చిత్రం చేయబోతున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందే సినిమాకోసం తనలోని కామెడీ యాంగిల్ ను మరోసారి బయటకు తీయబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి అనిల్ రావిపూడి కొన్ని సన్నివేశాలను చిరుకి వినిపించడం.. అవి ఎంతో హిలేరియస్ గా ఉన్నాయని మెగాస్టార్ చెప్పడం జరిగింది.

లేటెస్ట్ గా చిరు-అనిల్ రావిపూడి మూవీకి సంబంధించి మరో ఆసక్తికర న్యూస్ ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. ఈ మూవీలో మెగాస్టార్ డ్యూయెల్ రోల్ లో మురిపించబోతున్నాడట. చిరంజీవికి ద్విపాత్రాభినయాలు కొత్తేమీ కాదు. అయితే రీఎంట్రీ మూవీ 'ఖైదీ నంబర్ 150' తర్వాత చిరు ద్విపాత్రాభినయంలో కనిపించబోయే సినిమా ఇదే కానుంది.

ఈ చిత్రాన్ని సాహు గారపాటి – సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ వేసవి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టుకుని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మొత్తంగా అనిల్ రావిపూడి చిత్రం కోసం చిరు డబుల్ ట్రీట్ ఖాయమన్న మాట!

Tags

Next Story