జెట్ స్పీడ్ తో మెగా 157 షూటింగ్ !

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ మెగా157 షూటింగ్ సూపర్ స్పీడ్‌తో ఊపందుకుంది. డైరెక్టర్ అనిల్ రవిపూడి రూపొందిస్తున్న ఈ కామెడీ ఎంటర్‌టైనర్ సినిమా.. ప్లాన్ చేసినట్టుగానే ఫుల్ జోష్‌లో సాగుతోంది. తాజాగా కేరళలో మూడో షెడ్యూల్ కిక్‌స్టార్ట్ అయింది. ఆలప్పుళ లొకేషన్స్‌లో ఈ షూట్ జరుగుతోంది. చిరంజీవి, నయనతారలపై ఓ రొమాంటిక్ మెలోడీ సాంగ్‌ని షూట్ చేస్తున్నారు. ఈ పాటకు భాను మాస్టర్ స్టెప్పులు సెట్ చేస్తుండగా, ప్రముఖ లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ ఈ సాంగ్‌కి సాహిత్యం అందించారు.
ఈ రొమాంటిక్ నంబర్ ఖచ్చితంగా ఆడియన్స్‌కి ఫీల్‌గుడ్ వైబ్ ఇవ్వబోతోంది. ఈ షెడ్యూల్ జులై 23 వరకూ కొనసాగనుంది. ఆ తర్వాత చిన్న బ్రేక్ తీసుకుని, ఆగస్టులో హైదరాబాద్‌లో నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేయడానికి టీమ్ ప్లాన్ చేస్తోంది. అనిల్ రవిపూడి, అతని టీమ్ ఈ సినిమా షూటింగ్‌ని టర్బో మోడ్‌లో పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యారు. అక్టోబర్ నాటికి టోటల్ షూట్ వర్క్ కంప్లీట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ సినిమాని 2026 సంక్రాంతి సీజన్‌లో గ్రాండ్‌గా రిలీజ్ చేయాలని టీమ్ సూపర్ కాన్ఫిడెంట్‌గా ఉంది. అంతేకాదు, ఈ సినిమా డిజిటల్ రైట్స్ డీల్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. రికార్డ్ ధరకు ఈ డీల్ క్లోజ్ అవుతుందని టాక్ నడుస్తోంది, ఇది ఈ ప్రాజెక్ట్‌పై ఉన్న క్రేజ్‌ని చూపిస్తోంది. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి.
-
Home
-
Menu