టైటిల్ రివీలయ్యేది అప్పుడే !

టైటిల్ రివీలయ్యేది అప్పుడే !
X
చిరు బర్త్‌డే స్పెషల్‌గా ఈ అనౌన్స్‌మెంట్ జరగబోతోందని అనిల్ కన్ఫర్మ్ చేశాడు. కూల్ పోస్టర్స్, డోప్ వీడియోస్‌తో ఈ ఈవెంట్ ఫుల్ జోష్‌లో ఉండబోతోంది.

మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్ లోని సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సంగతి తెలిసిందే. మెగా157 అని పిలుచుకొనే ఈ మూవీ .. ఈ శుక్రవారం బిగ్ టైటిల్ రివీల్‌కి రెడీ అవుతోంది. చిరు బర్త్‌డే స్పెషల్‌గా ఈ అనౌన్స్‌మెంట్ జరగబోతోందని అనిల్ కన్ఫర్మ్ చేశాడు. కూల్ పోస్టర్స్, డోప్ వీడియోస్‌తో ఈ ఈవెంట్ ఫుల్ జోష్‌లో ఉండబోతోంది.

ఈ మూవీలో చిరు ‘శివ శంకర వరప్రసాద్’ గా కనిపించబోతున్నారు. ఇది ఆయన “చిరంజీవి” అనే స్క్రీన్ నేమ్ కు ముందు అసలు పేరు. టైటిల్ గురించి సోషల్ మీడియాలో బజ్ నడుస్తోంది. ‘మన శివ శంకర వరప్రసాద్ గారు’ అనే టైటిల్ పరిశీలనలో ఉందని టాక్. కానీ ఒరిజినల్ రివీల్‌తో రూమర్స్‌కి ఫుల్‌స్టాప్ పడబోతోంది.

నయనతార లీడ్ హీరోయిన్‌గా, కేథరిన్ థ్రెసా మరో కీ రోల్‌లో కనిపించ బోతున్నారు. సాహు గరపాటి ప్రొడ్యూస్ చేస్తుండగా, సుస్మిత కొణిదెల కో-ప్రొడ్యూసర్‌గా ఉన్న ఈ ప్రాజెక్ట్‌కి భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. మరి మెగా 157 కు ఏ టైటిల్ నిర్ణయిస్తారో చూడాలి.

Tags

Next Story