మహిళా సాధికారతకు మీనాక్షి కొత్త ప్రతినిధి.ప్రభుత్వం నుంచి అరుదైన గౌరవం

హీరోయిన్ మీనాక్షి చౌదరికి అరుదైన గౌరవం దక్కింది. ఆమెను ‘ఉమెన్ ఎంపవర్‌మెంట్ బ్రాండ్ అంబాసిడర్‘గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది.
మీనాక్షి చౌదరి టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కొద్ది కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ ద్వారా పరిచయమైన మీనాక్షి, తర్వాత ‘ఖిలాడీ, ‘హిట్: ది సెకండ్ కేస్’ చిత్రాలతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. మహేష్ బాబు ‘గుంటూరు కారం’, తమిళంలో విజయ్‌తో ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ వంటి పెద్ద ప్రాజెక్టుల్లో ఛాన్స్ దక్కించుకుని అనతి కాలంలోనే అగ్రపథంలోకి దూసుకెళ్లింది.
అత్యంత విజయవంతమైన ‘లక్కీ భాస్కర్’ తర్వాత, ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకుంది. ఈ విజయాల కారణంగా ఆమెను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘మహిళా సాధికారత’ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించినట్టు తెలుస్తోంది.
అయితే స్థానిక టాలెంట్‌ను ప్రోత్సహించాల్సిందిగా కొందరు అభిప్రాయపడినా, ఆమె ఎంపికపై ఎక్కువ మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకెళ్తున్న మీనాక్షి, సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా స్థిరపడుతోంది.
-
Home
-
Menu