క్లాస్ డైరెక్టర్‌తో మాస్ సినిమా.. టైటిల్ ఫిక్స్?

మాస్ మహారాజ రవితేజ మహా జోష్ మీద సినిమాలు చేసేవాడు. ఒకటి తర్వాత మరొకటిగా సినిమాలను పట్టాలెక్కించే వాడు. అయితే గత కొన్ని చిత్రాలుగా మాస్ రాజా కి విజయాలే కరువయ్యాయి. దీనికి తోడు ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ‘మాస్ జాతర‘ షూటింగ్ టైమ్ లో గాయపడ్డాడు. ఈనేపథ్యంలో రవితేజ సినిమాల స్పీడు తగ్గింది.
సితార సంస్థలో చేస్తున్న ‘మాస్ జాతర‘ తర్వాత లేటెస్ట్ గా మరో మూవీకి కమిట్ అయ్యాడట రవితేజ. ‘నేను శైలజ, చిత్రలహరి‘ వంటి క్లాస్ హిట్స్ అందించిన రైటర్ కమ్ డైరెక్టర్ కిషోర్ తిరుమల తో కొత్త సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారట.
క్లాస్ టచ్ ఉన్న సినిమాలకు కేరాఫ్‌గా నిలిచిన కిషోర్ తిరుమల.. రవితేజ సినిమాకి ‘అనార్కలి‘ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది. చరిత్రలో సలీం-అనార్కలి లవ్ స్టోరీకి ఎంతో ప్రాధాన్యత ఉంది. మరి.. ఆ స్టోరీని కిషోర్ తిరుమల మరో కోణంలో చెప్పబోతున్నాడా? అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మే నెలలో షూటింగ్ మొదలుపెట్టి 2026 సంక్రాంతికి ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా ప్రణాళిక జరుగుతుందట.
-
Home
-
Menu