వినాయకచవితి నుంచి దీపావళికి షిఫ్ట్ అవుతుందా?

ఇండిపెండెన్స్ డే వీకెండ్‌లో రిలీజైన ‘వార్ 2, కూలీ’ సినిమాలు ప్రేక్షకులను ఎక్కువగా ఇంప్రెస్ చేయలేకపోయాయి. మిక్స్డ్ రెస్పాన్స్ వల్ల బాక్సాఫీస్ వసూళ్లు దెబ్బతిన్నాయి. ఇప్పుడు టాలీవుడ్ ఫ్యాన్స్ తమ పైసలకు విలువైన సినిమా కోసం ఆత్రంగా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రవితేజ నుంచి ‘మాస్ జాతర’ అనే ఫుల్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ రాబోతోంది.
మొదట వినాయకచవితి కానుకగా.. ఆగస్టు 27న థియేటర్లలోకి రావాల్సిన ఈ మూవీ ఇప్పుడు పోస్ట్‌పోన్ అయినట్లు టాక్. రవితేజ ఫ్యాన్స్‌కి ఇది కాస్త డిసప్పా యింట్‌మెంటే. ఇండస్ట్రీ బజ్ ప్రకారం, మేకర్స్ ఇప్పుడు దీపావళి రిలీజ్‌ని ప్లాన్ చేస్తున్నారు. బహుశా అక్టోబర్ 20న ఈ సినిమా విడుదల కావచ్చని వార్తలొస్తున్నాయి. టీమ్ నుంచి త్వరలో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.
అప్పటిదాకా, ఫ్యాన్స్‌లో హైప్‌ని కంటిన్యూ చేస్తూ థియేటర్లలో సినిమా చూసేందుకు ఎగ్జైట్‌మెంట్‌ని రెడీగా ఉంచాలి. ‘మాస్ జాతర’ లో శ్రీలీల లీడ్ రోల్‌లో కనిపించనుంది. భాను బోగవరపు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని నాగ వంశీ, సాయి సౌజన్య తమ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. మ్యూజిక్ భీమ్స్ సిసిరోలియో అందిస్తున్నాడు.
-
Home
-
Menu