'మాస్ జాతర' హైదరాబాద్ షెడ్యూల్ మొదలైంది!

మాస్ మహారాజ రవితేజ ఇప్పుడు మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈకోవలోనే వరుస విజయాలతో మంచి ఫామ్ లో ఉన్న సితార సంస్థలో 'మాస్ జాతర' సినిమా చేస్తున్నాడు. రచయిత భాను భోగవరపు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. 'ధమాకా' తర్వాత రవితేజాతో మరోసారి కలిసి నటిస్తుంది శ్రీలీల. ఇటీవలే 12 రోజుల పాటు అరకు షెడ్యూల్ పూర్తి చేసుకున్న 'మాస్ జాతర' బృందం లేటెస్ట్ గా హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ మొదలు పెట్టుకుంది.
హైదరాబాద్ అవుట్‌స్కర్ట్స్‌లోని జన్వాడ రైల్వే స్టేషన్ సెట్లో ఈ షూటింగ్ జరుగుతుంది. వెంకట్ మాస్టర్ ఆధ్వర్యంలో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మూడు వారాల పాటు జరిగే ఈ షెడ్యూల్ లో ప్రస్తుతం రవితేజ, నవీన్ చంద్ర పాల్గొంటున్నారట. త్వరలో శ్రీలీల, రాజేంద్రప్రసాద్, అజయ్ ఘోష్, హైపర్ ఆది వంటి నటులు కూడా షూట్ లో పాల్గొననున్నట్టు తెలుస్తోంది. భీమ్స్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. 'ధమాకా' కోసం రవితేజ, శ్రీలీల కాంబోలో భీమ్స్ అందించిన మ్యూజిక్ ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. మొత్తంగా 'మాస్ జాతర'తో మాస్ మహారాజ్ మంచి కమ్‌బ్యాక్ ఇస్తాడనే కాన్ఫిడెన్స్ తో ఉన్నారు ఫ్యాన్స్
-
Home
-
Menu