ఈ కాంబో మూవీ నిజమేనా?

దక్షిణ భారత సినీ పరిశ్రమలో ఆశ్చర్యకరమైన, అత్యంత ఆసక్తికరమైన కలయిక ఒకటి రాబోతుందని వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం, యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నవీన్ పోలిశెట్టి కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతోందని సినీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.
ఈ వార్తలు నిజమైతే, మణిరత్నం-నవీన్ పోలిశెట్టి కాంబినేషన్‌లో సినిమా ఓ తమిళ-తెలుగు ద్విభాషా చిత్రం కానుందని చెప్పాలి. హాస్యంతో నిండి, చిలిపి ప్రేమకథగా ఈ సినిమా తెరకెక్కనున్నదని టాక్. ఈ ప్రాజెక్ట్‌తో నవీన్ పోలిశెట్టికి కెరీర్ లోనే ఓ మైలురాయిగా నిలవనుందన్న ఆశలు అభిమానుల్లో నెలకొన్నాయి. ఆయన చూపిస్తున్న నటన వైవిధ్యం ఇప్పటికే చాలా మంది దృష్టిని ఆకర్షించగా, మణిరత్నం వంటి దర్శకుడి చేతిలో మరోవిధంగా మెరిసే అవకాశం ఇది.
ఇప్పుడు అందరి మైండ్స్ లో రెండు ప్రశ్నలు తిరుగుతున్నాయి. ఈ సినిమాను ఎవరు నిర్మించబోతున్నారు? నవీన్‌కు జోడీగా ఎవరు కనిపించబోతున్నారు? సినీ అభిమానులు మాత్రం ఈ వార్తపై అధికారిక ప్రకటన కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మరి నిజంగానే ఈ కాంబినేషన్ లో సినిమా వస్తుందో లేదో చూడాలి.
-
Home
-
Menu