ప్రభుదేవా దర్శకత్వంలో మంచు విష్ణు?

ప్రభుదేవా దర్శకత్వంలో మంచు విష్ణు?
X
తాజా సమాచారం ప్రకారం.. అతను త్వరలో ప్రభుదేవా దర్శకత్వంలో ఒక సినిమా చేయబో తున్నాడని టాక్.

మంచు విష్ణు ‘కన్నప్ప’ రిలీజ్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నాడు. సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తోంది. విష్ణు, అతని టీమ్‌కి భారీ ఊరట కలిగించింది. ఈ సినిమా కోసం విష్ణు భారీగా ఖర్చు చేశాడు. కానీ థియేట్రికల్, నాన్-థియేట్రికల్ డీల్స్ ధరలు తక్కువగా ఉండటంతో రిస్క్ తీసుకున్నాడు. తన తదుపరి చిత్రంలో పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్ చేస్తానని విష్ణు ప్రకటించాడు. తాజా సమాచారం ప్రకారం.. అతను త్వరలో ప్రభుదేవా దర్శకత్వంలో ఒక సినిమా చేయబో తున్నాడని టాక్.

నటుడు, కొరియోగ్రాఫర్ అయిన ప్రభుదేవా దర్శకుడిగా మారి.. ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘పౌర్ణమి’, ‘శంకర్ దాదా జిందాబాద్’ వంటి తెలుగు సినిమాలతో పాటు పలు హిందీ చిత్రాలను రూపొందించాడు. ‘రాధే’ ఫ్లాప్ అవడంతో దర్శకత్వం నుంచి కొంత విరామం తీసుకున్నాడు. ఇప్పుడు మంచు విష్ణు సినిమాతో దర్శకుడిగా రీ-ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమా పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా. ఈ ఏడాది షూటింగ్ స్టార్ట్ కానుంది. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ నిర్మాణంలో ఈ మూవీ తెరకెక్కబోతోంది.

Tags

Next Story