‘కన్నప్ప’ థియేట్రికల్ బిజినెస్ పైనే ఫుల్ ఫోకస్

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ “కన్నప్ప” ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్‌లో సాగుతున్నాయి. ఈ వారంలో ట్రైలర్ గ్రాండ్‌గా లాంచ్ కాబోతోంది. సినిమా థియేటర్లలో బిగ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. అయితే, “కన్నప్ప” ఓటీటీ డీల్ ఇంకా ఫైనల్ అవ్వలేదు. కానీ, విష్ణు ఈ విషయంలో సూపర్ కూల్‌గా ఉన్నాడు. నిజానికి, సినిమా రిలీజ్ అయ్యాకే ఓటీటీ డీల్ గురించి డిసైడ్ చేయాలని ఫిక్స్ అయ్యాడు.
విష్ణు ఇప్పటికే ఒక టాప్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌తో స్మార్ట్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ డీల్ టోటల్‌గా ఫ్లెక్సిబుల్‌గా డిజైన్ చేయబడింది. సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అయితే, ముందుగా ఫైనల్ చేసిన డీల్ ప్రకారం ఓటీటీ రిలీజ్ జరుగుతుంది. ఒకవేళ సినిమా ఆశించిన స్థాయిలో పెర్ఫార్మ్ చేయకపోతే, అప్పుడు వేరే ప్లాన్ అమల్లోకి వస్తుంది. ఈ రెండు ఆప్షన్స్ కూడా ఒప్పందంలో స్పష్టంగా రాసి.. ఇరు పక్షాలు సైన్ చేసిన లీగల్ డాక్యుమెంట్‌లో చేర్చారు. ఈ స్ట్రాటెజీతో విష్ణు టెన్షన్ ఫ్రీగా సినిమా థియేట్రికల్ రన్‌పైనే ఫుల్ గా ఫోకస్ పెట్టాడు.
“కన్నప్ప” బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుందని విష్ణుకు ఫుల్ కాన్ఫిడెన్స్. ఈ సినిమా కేవలం ఒక సాధారణ చిత్రం కాదు. ఇందులో ప్రభాస్, మోహన్‌లాల్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ స్టార్ కాస్ట్ సినిమాకి ఇంకా ఎక్కువ హైప్ తీసుకొస్తోంది. అంతేకాదు, సినిమా కథ, విజువల్స్, యాక్షన్ సీక్వెన్సెస్ అన్నీ కలిపి ఆడియెన్స్‌కు ఫుల్ ఎంటర్‌లైన్మెంట్ ప్యాకేజీ ఇస్తాయని విష్ణు బలంగా నమ్ముతున్నాడు.
-
Home
-
Menu