అనస్వరా రాజన్ తెలుగు డెబ్యూ ‘ఛాంపియన్’

టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్ తనయుడు మేకా రోషన్ తదుపరి చిత్రం ‘చాంపియన్’. ఈ మూవీ గ్లింప్స్ అండ్ ఫస్ట్ లుక్ ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తించాయి. ఈ స్పోర్ట్స్ డ్రామా థియేటర్స్ లో అదిరిపోయే ఎక్స్పీరియన్స్ ను అందిస్తుందని మేకర్స్ చెబుతున్నారు. తాజాగా ఈ మూవీలో కథానాయికగా మలయాళ స్టార్ హీరోయిన్ అనస్వరా రాజన్‌గా అనౌన్స్ చేశారు.
అనస్వరా రాజన్ పుట్టినరోజు సందర్భంగా.. చిత్ర బృందం ఆమె చాంపియన్ లోని ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది. ఆమె పాత్ర పేరు చంద్రకళ అని రివీల్ చేశారు. వ్యాన్ కిటికీలోంచి ఆమె తీక్షణంగా చూస్తున్నట్టుగా రిలీజైన లుక్ అందరినీ ఆకట్టు్కుంటోంది. అనస్వర రాజన్ ‘సూపర్ శరణ్య, అబ్రహం ఓజ్లర్, గురువాయూర్ అంబలనడయిల్, నేరు, రేఖాచిత్రం’ వంటి చిత్రాల్లో తన అద్భుతమైన నటనతో మలయాళ ప్రేక్షకుల మనసు గెలుచుకుంది.
మలయాళ సినిమాలో స్టార్‌గా వెలుగొందుతున్న ఆమె, ‘చాంపియన్’ మూవీతో తెలుగులో అడుగుపెడుతోంది. ఈ చిత్రం ఆమెకు అద్భుతమైన డెబ్యూగా నిలవనుంది. ఈ చిత్రాన్ని ప్రదీప్ అద్వైతం డైరెక్ట్ చేస్తున్నాడు. జీ స్టూడియోస్ నిర్మిస్తోంది. షూటింగ్ వేగంగా జరుగుతోందని, త్వరలో మరిన్ని ఆసక్తికర అప్‌డేట్‌లను ప్రకటిస్తామని చిత్ర బృందం తెలిపింది.
-
Home
-
Menu